క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ ఘన విజయం | IPL 2026: Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates | Sakshi
Sakshi News home page

IPL 2026: క్వాలిఫయర్‌-2లో గుజరాత్‌ ఘన విజయం

May 29 2026 7:04 PM | Updated on May 29 2026 11:30 PM

IPL 2026: Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates

Gujarat titans vs Rajasthan royals Qualifier 2 Live updates:  ముల్లాన్‌పూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-2లో 7 వికెట్ల తేడాతో గుజరాత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో తమ ఫైనల్ బెర్త్‌ను గుజరాత్ ఖరారు చేసుకుంది. రాజస్తాన్ నిర్ధేశించిన 215 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 18.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.

ఈ విజయంలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ది కీలక పాత్ర. ఈ మ్యాచ్‌లో గిల్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. గిల్‌ కేవలం 53 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 104 పరుగులు చేశాడు. గిల్‌తో పాటు సుదర్శన్‌(58) హాఫ్‌ సెంచరీతో రాణించాడు.  రాజస్తాన్‌ బౌలర్లలో ఆర్చర్‌, బర్గర్‌, బ్రిజేష్‌ శర్మ తలా వికెట్‌ సాధించారు. మే 31న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఆర్సీబీతో గుజరాత్‌ తలపడనుంది.

సుందర్‌ అవుట్‌
వాషింగ్టన్‌ సుందర్‌(6).. బర్గర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

గుజరాత్‌ రెండో వికెట్‌ డౌన్‌
గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 104 పరుగులు చేసిన గిల్‌.. ఆర్చర్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు.

శుబ్‌మన్‌ సెంచరీ
గుజరాత్‌ కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ కేవలం 47 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. గుజరాత్‌ విజయానికి 38 బంతుల్లో 39 పరుగులు కావాలి.

గుజరాత్‌ తొలి వికెట్‌ డౌన్‌
సాయిసుదర్శన్‌(58) రూపంలో గుజరాత్ తొలి వికెట్‌ కోల్పోయింది. సుదర్శన్‌ మరోసారి హిట్‌వికెట్‌ రూపంలో వెనుదిరిగాడు.

విజయం దిశగా గుజరాత్‌
గుజరాత్‌ టైటాన్స్‌ విజయం దిశగా దూసుకుపోతుంది. ఓపెనర్లు శుబ్‌మన్‌ గిల్‌(39 బంతుల్లో 81), సాయిసుదర్శన్‌(27 బంతుల్లో 51) దుమ్ములేపుతున్నారు. గుజరాత్‌ విజయానికి 54 బంతుల్లో 71 పరుగులు కావాలి.

దుమ్ములేపుతున్న గుజరాత్‌ ఓపెనర్లు
6 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్‌ టైటాన్స్‌ వికెట్‌ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. క్రీజులో సాయిసుదర్శన్‌(30), శుబ్‌మన్‌ గిల్‌(29) ఉన్నారు.

దూకుడుగా ఆడుతున్న గుజరాత్‌
215 పరుగుల భారీ లక్ష్య చేధనను గుజరాత్‌ టైటాన్స్‌ ఘనంగా ఆరంభించింది. 3 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్‌ వికెట్‌ నష్టపోకుండా 41 పరుగులు చేసింది. క్రీజులో శుబ్‌మన్‌ గిల్‌(21), సాయిసుదర్శన్‌(14) ఉన్నారు.

వైభవ్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ టార్గెట్‌
ముల్లాన్‌పూర్‌ వేదికగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫయర్‌-2లో రాజస్తాన్‌ యువ ఆటగాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. వైభవ్‌ కేవలం 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 

అతడితో పాటు డొనొవాన్ ఫెరీరా(11 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 38) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. రవీంద్ర జడేజా(45) కూడా రాణించాడు. ఫలితంగా రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. గుజరాత్‌ బౌలర్లలో జాసన్‌ హోల్డర్‌, రబాడ తలా రెండు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ తలా వికెట్‌ సాధించారు.
వైభవ్‌ సెంచరీ మిస్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. సెంచరీని 4 పరుగులు దూరంలో మిస్‌ చేసుకున్నాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 96 పరుగులు చేసి వైభవ్‌ ఔటయ్యాడు.

వైభవ్‌ హాఫ్‌ సెంచరీ
వైభవ్‌ సూర్యవంశీ 27 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. 14 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 129/5

రాజస్తాన్‌ ఐదో వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన ఆర్చర్‌.. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా తిరిగి ​క్రీజులోకి వచ్చాడు.

రాజస్తాన్‌ నాలుగో వికెట్‌ డౌన్‌
దసన్‌ షనక రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 3 పరుగులు చేసిన షనక.. హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

రియాన్‌ పరాగ్‌ రెండో వికెట్‌ డౌన్‌
రియాన్‌ పరాగ్‌ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 11 పరుగులు చేసిన రియాన్‌ పరాగ్‌.. జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
జడేజా రిటైర్డ్‌ హార్ట్‌
మంచి టచ్‌లో కన్పించిన రవీంద్ర జడేజా(19 బంతుల్లో 34) గాయం కారణంగా రిటైర్డ్‌ హార్ట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన రియాన్‌ పరాగ్‌ సైతం దూకుడుగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 100/2

మొదలెట్టిన వైభవ్‌
వైభవ్‌ సూర్యవంశీ(14 బంతుల్లో 27) దూకుడుగా ఆడుతున్నాడు. 4 ఓవర్లు ముగిసే సరికి రాజస్తాన్‌ స్కోర్‌: 45/2

రాజస్తాన్‌కు భారీ షాక్‌.. 13 రన్స్‌కే 2 వికెట్లు
ధ్రువ్‌ జురెల్‌ రూపంలో రాజస్తాన్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. 7 పరుగులు చేసిన జురెల్‌.. రబాడ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2 ఓవర్లకు రాజస్తాన్‌ స్కోర్‌: 13/2

రాజ‌స్తాన్ తొలి వికెట్ డౌన్‌
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు భారీ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ య‌శస్వి జైశ్వాల్ కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసి సిరాజ్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. 

ఐపీఎల్‌-2026 క్వాలిఫయర్‌-2లో భాగంగా ముల్లాన్‌పూర్‌ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది.

గుజరాత్‌ తమ జట్టులో ఓ మార్పు చేసింది. స్పిన్నర్‌ సాయికిషోర్‌ తుది జట్టులోకి వచ్చాడు. రాజస్తాన్‌ మాత్రం ఎలాంటి ఎలాంటి మార్పులు చేయలేదు.

తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), జోస్ బట్లర్(వికెట్ కీపర్‌), నిషాంత్ సింధు, వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, కగిసో రబడ, ప్రసిధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధృవ్ జురెల్(వికెట్ కీపర్‌), రియాన్ పరాగ్(కెప్టెన్‌), డోనోవన్ ఫెరీరా, దసున్ షనక, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, యశ్ రాజ్ పుంజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement