IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్‌ విజయం | IPL 2026: Gujarat Titans Vs Kolkata Knight Riders Match Live Updates | Sakshi
Sakshi News home page

IPL 2026: ఉత్కంఠపోరులో గుజరాత్‌ విజయం

Apr 17 2026 7:05 PM | Updated on Apr 17 2026 11:40 PM

IPL 2026: Gujarat Titans Vs Kolkata Knight Riders Match Live Updates

Gujarat Titans Vs KKR Updates..

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.   181 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గిల్‌ 86 పరుగులతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీయగా, సునీల్ నరైన్‌, రమన్‌దీప్‌, వైభవ్ అరోరాలు ఒక్కో వికెట్ పడగొట్టారు. 

కేకేఆర్‌ 180 ప‌రుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) ప‌రుగుల‌తో కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో రబాడ 3 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్, అశోక్ శ‌ర్మ‌లు చెరో 2 వికెట్లు ప‌డగొట్టారు.

86 పరుగులు చేసిన శుబ్‌మన్‌ గిల్‌ వైభవ్‌ అరోరా బౌలింగ్‌లో కామెరున్‌ గ్రీన్‌ అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. ప్రస్తుతం గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

  • 16 ఓవర్లు ముగిసేసరికి గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. గిల్ 81, పిలిప్స్ 4 పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు వాషింగ్టన్ సుందర్ (13) వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో వెనుదిరిగాడు.

గిల్ అర్థ‌శ‌త‌కం.. గుజ‌రాత్ 101/2
కేకేఆర్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్‌మ‌న్ గిల్ అర్థ‌శ‌త‌కం సాధించాడు. గిల్ 27 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ అందుకున్నాడు. అంత‌క‌ముందు గుజ‌రాత్ రెండో వికెట్ కోల్పోయింది. 25 ప‌రుగులు చేసిన జాస్ బ‌ట్ల‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ 11 ఓవ‌ర్ల‌లో  రెండు వికెట్ల న‌ష్టానికి 104 ప‌రుగులు చేసింది.

తొలి వికెట్ కోల్పోయిన గుజ‌రాత్‌
కేకేఆర్‌తో మ్యాచ్‌లో గుజ‌రాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 22 ప‌రుగులు చేసిన సాయి సుద‌ర్శ‌న్ సునీల్ న‌రైన్ బౌలింగ్‌లో కార్తిక్ త్యాగికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం గుజ‌రాత్ 6 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి 71 ప‌రుగులు చేసింది.

దంచికొడుతున్న గుజ‌రాత్‌
181 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఛేద‌న‌ను దూకుడుగిఆ ఆరంభించింది. 5 ఓవ‌ర్లు ముగిసేస‌రికి గుజ‌రాత్ వికెట్ న‌ష్ట‌పోకుండా 57 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ (22), గిల్ (34) క్రీజులో ఉన్నారు.

గుజ‌రాత్ టార్గెట్ 181 ప‌రుగులు
గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ 180 ప‌రుగులకు ఆలౌటైంది. కామెరున్ గ్రీన్ (79) ప‌రుగుల‌తో కేకేఆర్ గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంలో కీల‌క‌పాత్ర పోషించాడు. రోవ్‌మెన్ పావెల్ 27 ప‌రుగుల‌తో ప‌ర్వాలేద‌నిపించాడు. ఒక ద‌శ‌లో 15 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 148 ప‌రుగుల‌తో ప‌టిష్టంగా క‌నిపించిన కేకేఆర్ చివ‌రి ఐదు ఓవ‌ర్ల‌లో కేవ‌లం 32 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నార్హం. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో రబాడ 3 వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్, అశోక్ శ‌ర్మ‌లు చెరో 2 వికెట్లు ప‌డగొట్టారు.

  • 16 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అంతకముందు రింకూ సింగ్‌ రబాడ బౌలింగ్‌లో ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు.

ఐదో వికెట్‌ కోల్పోయిన కేకేఆర్‌
గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ 147 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 9 పరుగులు చేసిన అనుకుల్ రాయ్ ప్రసిధ్ క్రిష్ణ బౌలింగ్‌లో బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్ 5 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. కామెరున్ ‍గ్రీన్ 75 పరుగులతో బ్యాటింగ్ ఆడుతున్నాడు.

87 పరుగుల వద్ద కేకేఆర్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. పావెల్‌ (27).. అశోక్‌ శర్మ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

8 ఓవర్లలో కేకేఆర్‌ 59/3
8 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్‌ 3 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. పావెల్‌ (21), గ్రీన్‌ (8) క్రీజులో ఉన్నారు. 

  • గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేకేఆర్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. 19 పరుగులు చేసిన సీఫెర్ట్‌ రబాడ బౌలింగ్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం కేకేఆర్‌ 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 37 పరుగులు చేసింది.

రెండో వికెట్ కోల్పోయిన కేకేఆర్‌
8 ప‌రుగులు చేసిన అంగ్‌క్రిష్ రఘువంశీ ర‌బాడ బౌలింగ్‌లో జాస్ బ‌ట్ల‌ర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం కేకేఆర్ 2 ఓవ‌ర్ల‌లో 2 వికెట్ల న‌ష్టానికి 22 ప‌రుగులు చేసింది.

రహానే గోల్డెన్‌ డక్‌
గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ అజింక్య రహానే సిరాజ్‌ బౌలింగ్‌లో గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు.

బ్యాటింగ్‌ ఎంచుకున్న కేకేఆర్‌
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా శుక్రవారం 25వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్‌) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కేకేఆర్‌ ఈ  మ్యాచ్‌కు ఒక మార్పుతో బరిలోకి దిగింది. ఫిన్‌ అలెన్‌ స్థానంలో టిమ్‌ సీఫెర్ట్‌ జట్టులోకి వచ్చాడు. మరోవైపు గుజరాత్‌ మాత్రం జట్టులో ఏ మార్పు చేయలేదు. 

ఈ సీజన్‌లో కేకేఆర్‌ ఇప్పటివరకు ఒక్క విజయం కూడా సాధించలేదు. ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటి పరాజయాలు, ఒక మ్యాచ్‌ రద్దు కావడంతో పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. మరోవైపు గుజరాత్‌ టైటాన్స్‌ ఆడిన 4 మ్యాచ్‌ల్లో రెండు విజయాలతో ఐదో స్థానంలో ఉంది. ముఖాముఖి పోరులో నాలుగుసార్లు తలపడగా గుజరాత్‌ మూడుసార్లు, కేకేఆర్‌ ఒకసారి గెలుపొందాయి.

కోల్‌కతా నైట్ రైడర్స్: టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్‌ కీప‌ర్‌), రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, రమణదీప్ సింగ్, అనుకూల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి.

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్‌ కీప‌ర్‌),వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అశోక్ శర్మ, కగిసో రబడ, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్‌ క్రిష్ణ.

Advertisement
 
Advertisement
Advertisement