Gujarat titans vs Delhi capitals live Updates: ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి.
గుజరాత్ రెండో వికెట్ డౌన్
జోస్ బట్లర్ రూపంలో గుజరాత్ టైటాన్స్ రెండో వికెట్ కోల్పోయింది. 52 పరుగులు చేసిన బట్లర్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 85/2
దూకుడుగా ఆడుతున్న గుజరాత్
జోస్ బట్లర్(22 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47) దూకుడుగా ఆడుతున్నాడు. 6 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది.
గుజరాత్ తొలి వికెట్ డౌన్
19 పరుగుల గుజరాత్ టైటాన్స్ తొలి వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన సాయిసుదర్శన్.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. 2.1 ఓవర్లకు గుజరాత్ స్కోర్: 19/1
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
ఐపీఎల్-2026లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. శుభ్‌మన్ తిరిగి రావడంతో కుమార్ కుశాగ్ర బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఢిల్లీ మాత్రం తమ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.
తుది జట్లు
గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబడ, మహ్మద్ సిరాజ్, అశోక్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్: కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, విప్రజ్ నిగమ్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, కుల్దీప్ యాదవ్, లుంగి ఎన్గిడి, టి నటరాజన్, ముఖేష్ కుమార్


