
ముంబై ఇండియన్స్‌లోకి కొత్త ఆటగాడు వచ్చాడు. ముంజేతి గాయం కారణంగా సీజన్ మొత్తానికే దూరమైన వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ స్థానంలో సౌరాష్ట్ర వికెట్ కీపర్ బ్యాటర్ హార్విక్ దేశాయ్ జట్టులోకి వచ్చాడు. యంగ్ ఇండియా 2018 అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో హార్విక్ సభ్యుడిగా ఉన్నాడు. ఆ వరల్డ్‌కప్ ఫైనల్లో టీమిండియా విన్నింగ్ రన్స్‌ను హార్వికే కొట్టాడు. 24 ఏళ్ల హార్విక్ పేరిట దేశవాలీ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో సెంచరీలు ఉన్నాయి.
(హార్విక్ దేశాయ్)
Harvik Desai replaces Vishnu Vinod in Mumbai Indians in IPL 2024. pic.twitter.com/oTxg6WcRi3
— Johns. (@CricCrazyJohns) April 11, 2024
కాగా, ముంబై ఇండియన్స్ ప్రస్తుత సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తూ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం ఒకే ఒక విజయం సాధించింది. ఈ విజయం కూడా హ్యాట్రిక్ ఓటముల తర్వాత వచ్చింది. తమ చివరి మ్యాచ్‌లో ముంబై.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
(విష్ణు వినోద్)
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇవాళ (ఏప్రిల్ 11) సొంత మైదానమైన వాంఖడేలో ఆర్సీబీతో తలపడనుంది. ఇరు జట్లలో దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికొస్తే.. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇరు జట్లు ఇప్పటివరకు 32 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. ముంబై 18, ఆర్సీబీ 14 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.