IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఆడుతూపాడుతూ విజయం సాధించిన గుజరాత్‌ | IPL 2024 GT VS SRH Ahmedabad Match Live Score Updates And Highlights In Telugu - Sakshi
Sakshi News home page

IPL 2024: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఆడుతూపాడుతూ విజయం సాధించిన గుజరాత్‌

Mar 31 2024 3:15 PM | Updated on Mar 31 2024 6:58 PM

IPL 2024 GT VS SRH Ahmedabad Match Updates And Highlights - Sakshi

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. ఆడుతూపాడుతూ విజయం సాధించిన గుజరాత్‌
అహ్మదాబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ సునాయాసంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. గుజరాత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. 

డేవిడ్‌ మిల్లర్‌ (44 నాటౌట్‌) సిక్సర్‌ బాది మ్యాచ్‌ ముగించాడు. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో సాహా 25, గిల్‌ 36, సాయి సుదర్శన్‌ 45, విజయ్‌ శంకర్‌ 14 (నాటౌట్‌) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో షాబాజ్‌ అహ్మద్‌, మార్కండే, కమిన్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేదు. మయాంక్‌ అగర్వాల్‌ 16, హెడ్‌ 19, అభిషేక్‌ శర్మ 29, మార్క్రమ్‌ 17, క్లాసెన్‌ 24, షాబాజ్‌ అహ్మద్‌ 22, అబ్దుల్‌ సమద్‌ 29, వాషింగ్టన్‌ సుందర్‌ డకౌటయ్యారు. 

గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్‌ చేసి సన్‌రైజర్స్‌ను నామమాత్రపు స్కోర్‌కే పరిమతం చేశారు. మోహిత్‌ శర్మ 3, ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు. 

లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌
163 పరుగుల ఛేదనలో గుజరాత్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 14 ఓవర్లలో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసి విజయానికి మరో 36 పరుగుల దూరంలో ఉంది. సాయి సుదర్శన్‌ (36), మిల్లర్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
9.1వ ఓవర్‌: 74 పరుగుల వద్ద గుజరాత్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. మయాంక్‌ మార్కండే బౌలింగ్‌లో అబ్దుల్‌ సమద్‌కు క్యాచ్‌ ఇచ్చి శుభ్‌మన్‌ గిల్‌ (36) ఔటయ్యాడు. 

లక్ష్యం దిశగా సాగుతున్న గుజరాత్‌
163 పరుగుల నామమాత్రపు లక్ష్య ఛేదనలో గుజరాత్‌ నిదానంగా అడుగులు వేస్తుంది. 9 ఓవర్ల అనంతరం ఆ జట్టు వికెట్‌ నష్టానికి 74 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్‌ 36, సాయి సుదర్శన్‌ 13 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. 66 బంతుల్లో 89 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. 

టార్గెట్‌ 163.. తొలి వికెట్‌ కోల్పోయిన గుజరాత్‌
4.1వ ఓవర్‌: 36 పరుగుల వద్ద గుజరాత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. షాబాజ్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో కమిన్స్‌కు క్యాచ్‌ ఇచ్చి వృద్దిమాన్‌ సాహా (25) ఔటయ్యాడు. గిల్‌కు (11) జతగా సాయి సుదర్శన్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. 5 ఓవర్ల తర్వాత గుజరాత్‌ స్కోర్‌ 45/1గా ఉంది. 

162 పరుగులకే పరిమితమైన సన్‌రైజర్స్‌
గుజరాత్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్‌ చేయలేకపోయారు. మయాంక్‌ అగర్వాల్‌ 16, హెడ్‌ 19, అభిషేక్‌ శర్మ 29, మార్క్రమ్‌ 17, క్లాసెన్‌ 24, షాబాజ్‌ అహ్మద్‌ 22, అబ్దుల్‌ సమద్‌ 29, వాషింగ్టన్‌ సుందర్‌ డకౌటయ్యారు. గుజరాత్‌ బౌలర్లు కలిసికట్టుగా బౌలింగ్‌ చేశారు. మోహిత్‌ శర్మ 3, ఒమర్‌జాయ్‌, ఉమేశ్‌ యాదవ్‌, రషీద్‌ ఖాన్‌, నూర్‌ అహ్మద్‌ తలో వికెట్‌ తీశారు.

రషీద్‌ ఖాన్‌ సూపర్‌ క్యాచ్‌.. మార్క్రమ్‌ ఔట్‌
14.4వ ఓవర్‌: రషీద్‌ ఖాన్‌ సూపర్‌ క్యాచ్‌ పట్టి మార్క్రమ్‌ను పెవిలియన్‌కు సాగనంపాడు. ఉమేశ్‌ బౌలింగ్‌లో మార్క్రమ్‌ (17) ఔటయ్యాడు. సన్‌రైజర్స్‌ స్కోర్‌ 114/5గా ఉంది. షాబాజ్‌ అహ్మద్‌కు (6) జతగా అబ్దుల్‌ సమద్‌ క్రీజ్‌లోకి వచ్చాడు.

క్లాసెన్‌ను బోల్తా కొట్టించిన రషీద్‌ ఖాన్‌
13.4వ ఓవర్‌: భీకరఫామ్‌లో ఉన్న హెన్రిచ్‌ క్లాసెన్‌ను (24) రషీద్‌ ఖాన్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 14 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 109/4గా ఉంది. మార్క్రమ్‌ (17), షాబాజ్‌ అహ్మద్‌ (1) క్రీజ్‌లో ఉన్నారు.

ఈజీ క్యాచ్‌ ఇచ్చి ఔటైన అభిషేక్‌
10వ ఓవర్‌ చివరి బంతికి అభిషేక్‌ శర్మ (29) ఔటయ్యాడు. మోహిత్‌ శర్మ బౌలింగ్‌లో గిల్‌కు సునాయాసమైన క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. 10 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 74/3గా ఉంది. మార్క్రమ్‌ (7), క్లాసెన్‌ (0) క్రీజ్‌లో ఉన్నారు.

రెండో వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌.. హెడ్‌ ఔట్‌
6.4 ఓవర్‌: 58 పరుగుల వద్ద సన్‌రైజర్స్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ట్రవిస్‌ హెడ్‌ (19) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 7 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 60/2గా ఉంది. అభిషేక్‌ శర్మ (20), మార్క్రమ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు.

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌
34 పరుగుల వద్ద (4.2 ఓవర్‌) సన్‌రైజర్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఒమర్‌జాయ్‌ బౌలింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌కు క్యాచ్‌ ఇచ్చి మయాంక్‌ అగర్వాల్‌ (16) ఔటయ్యాడు. హెడ్‌కు (16) జతగా అభిషేక్‌ శర్మ క్రీజ్‌లోకి వచ్చాడు.

ధాటిగా ప్రారంభించిన సన్‌రైజర్స్‌
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌ తొలి ఓవర్‌ నుంచి గుజరాత్‌పై ఎదురుదాడిని ప్రారంభించింది. ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌.. ఒమర్‌జాయ్‌ వేసిన తొలి ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలతో ఊచకోతను స్టార్ట్‌ చేశాడు. ఆతర్వాత రెండు, మూడు, నాలుగు ఓవర్లలో కూడా ఓ మోస్తరుగా పరుగులు వచ్చాయి. 4 ఓవర్ల తర్వాత సన్‌రైజర్స్‌ స్కోర్‌ 34/0గా ఉంది. మయాంక్‌ అగర్వాల్‌ (16), ట్రవిస్‌ హెడ్‌ (16) క్రీజ్‌లో ఉన్నారు. 

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ఇవాళ (మార్చి 31) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, గుజరాత్‌ టైటాన్స్‌ తలపడుతున్నాయి. అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్‌, గుజరాత్‌ చెరో మ్యాచ్‌ (రెండు మ్యాచ్‌ల్లో) గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి.

తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించిన గుజరాత్‌.. రెండో మ్యాచ్‌లో సీఎస్‌కే చేతిలో ఓటమిపాలైంది. మరోవైపు కేకేఆర్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓటమిని ఎదుర్కొన్న సన్‌రైజర్స్‌.. ముంబైపై బంపర్‌ విక్టరీని నమోదు చేసింది. ఇక నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ పాత జట్టునే యధాతథంగా కొనసాగించగా.. గుజరాత్‌ రెండు మార్పులతో బరిలోకి దిగింది. స్పెన్సర్‌ జాన్సన్‌, సాయి కిషోర్‌ స్థానాల్లో నూర్‌ అహ్మద్‌, నల్కండే తుది జట్టులోకి వచ్చారు.  

తుది జట్లు..
గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సాహా(వికెట్‌కీపర్‌), శుభ్‌మన్ గిల్(కెప్టెన్‌), అజ్మతుల్లా ఒమర్జాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్శన్ నల్కండే

సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, ట్రవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్, హెన్రిచ్ క్లాసెన్(వికెట్‌కీపర్‌), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement