IPL Tickets Booking: How To Book IPL 2023 Tickets Online - Sakshi
Sakshi News home page

IPL 2023: మరో 10 రోజుల్లో క్రికెట్‌ పండుగ.. ఆన్‌లైన్‌లో టికెట్లు ఇలా బుక్‌ చేసుకోవచ్చు

Mar 21 2023 5:56 PM | Updated on Mar 21 2023 6:06 PM

IPL 2023 Online Ticket Booking And Price - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. మరో 10 రోజుల్లో క్రికెట్‌ పండుగ ప్రారంభంకానుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్‌ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. 

ప్రతి జట్టు సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడనుండటంతో ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందు భారీ సంఖ్యలో అభిమానులు మైదానాలకు తరలిరావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీగా డిమాండ్‌ పెరుగనుంది. దీంతో అభిమానులు టికెట్ల కోసం ముందుగానే ఎగబడుతున్నారు. 

ఈ సీజన్‌కు సంబంధించి ఆన్‌లైన్‌లో బుకింగ్ సేవలను పేటీఎమ్‌ ఇన్సైడర్.ఇన్‌, బుక్ మై షో, టికెట్‌జీనీ సంస్థలు అందిస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీల అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా కూడా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. టికెట్ల ధరలు రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది (వెన్యూని బట్టి టికెట్‌ ధర నిర్ణయించబడుతుంది). వెబ్‌సైట్‌ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. బుకింగ్‌ కన్ఫర్మేషన్‌ అయిన 72 గంటల తర్వాత టికెట్‌ హార్ఢ్‌ కాపీని ఆన్‌లైన్‌లోనే పొందవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement