breaking news
Insider Dot In
-
మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ.. ఆన్లైన్లో టికెట్లు ఇలా బుక్ చేసుకోవచ్చు
ఐపీఎల్-2023 సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజుల్లో క్రికెట్ పండుగ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మార్చి 31న జరిగే మ్యాచ్‌తో ఐపీఎల్ 16వ ఎడిషన్ ప్రారంభమవుతుంది. మార్చి 31 నుంచి మే 28 వరకు జరిగే ఈ క్రికెట్ సంబరంలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్రతి జట్టు సొంత మైదానాల్లో 7 మ్యాచ్‌లు ఆడనుండటంతో ఈసారి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందు భారీ సంఖ్యలో అభిమానులు మైదానాలకు తరలిరావచ్చని నిర్వహకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లకు భారీగా డిమాండ్ పెరుగనుంది. దీంతో అభిమానులు టికెట్ల కోసం ముందుగానే ఎగబడుతున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి ఆన్లైన్లో బుకింగ్ సేవలను పేటీఎమ్ ఇన్సైడర్.ఇన్, బుక్ మై షో, టికెట్జీనీ సంస్థలు అందిస్తున్నాయి. ఆయా ఫ్రాంచైజీల అధికారిక వెబ్సైట్ల ద్వారా కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ల ధరలు రూ. 500 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది (వెన్యూని బట్టి టికెట్ ధర నిర్ణయించబడుతుంది). వెబ్సైట్ లేదా సంబంధిత యాప్‌ల ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. బుకింగ్ కన్ఫర్మేషన్ అయిన 72 గంటల తర్వాత టికెట్ హార్ఢ్ కాపీని ఆన్లైన్లోనే పొందవచ్చు. -
ఇన్సైడర్.ఇన్‌లో పేటీఎమ్‌కు మెజారిటీ వాటా!
డీల్ విలువ రూ.193 కోట్లు న్యూఢిల్లీ: డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్, ముంబైకి చెందిన ఈవెంట్స్, ప్రోపర్టీస్‌కు సంబంధించి టికెటింగ్ ప్లాట్ఫార్మ్ సంస్థ ఇన్‌సైడర్‌డాట్‌ఇన్‌లో వాటా కొనుగోలు చేయనున్నది. ఇన్‌సైడర్‌డాట్‌ఇన్‌లో మెజారిటీ వాటా కొనుగోలు కోసం పేటీఎమ్ సంస్థ 3 కోట్ల డాలర్లు(రూ.193 కోట్లు) వెచ్చించనున్నదని సమాచారం. రానున్న కొన్ని వారాల్లో ఈ డీల్‌కు సంబంధించి ప్రకటన రావచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈ విషయమై ఇరు సంస్థలు స్పందించలేదు. ఈ డీల్ కుదిరితే ఆన్లైన్ టికెటింగ్ వ్యాపారంలో పేటీఎమ్ మరింత బలపడుతుంది. బుక్‌మైషో వంటి సంస్థలకు గట్టిపోటీనివ్వగలుగుతుంది.