
pc: IPL.com
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే...
ఇంఫాల్: మణిపూర్ రాజకీయాల్లో(Manipur Politics) ...
ప్రపంచ పోషకాహార దినోత్సవం 2025 (World Nutrition Day 20...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మ�...
బెంగళూరు: కన్నడ భాష తమిళం నుంచే పుట్ట...
అమెరికా,డల్లాస్ లోని డాక్టర్ పెప్పర్...
ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి, ‘స్పి...
సాక్షి,ఢిల్లీ: రేపు పాక్ సరిహద్దు రా�...
బాలీవుడ్ మెగాస్టార్, బిగ్‌బీ అమితాబ...
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో కూట�...
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజ�...
సాక్షి, గుంటూరు: తెలుగు దేశం పార్టీ మహ...
భారత సంతతికి చెందిన సీఈవో, యూ ట్యూబ్�...
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధిన�...
సాక్షి, వైఎస్సార్ జిల్లా: 'సమాజమే దేవా...
Apr 23 2022 6:55 PM | Updated on Apr 23 2022 10:07 PM
pc: IPL.com
IPL 2022: ఆర్సీబీని చిత్తుచేసిన ఎస్ఆర్హెచ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం
ఐపీఎల్-2022లో ఎస్ఆర్హెచ్ వరుసగా ఐదో విజయం సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ47 పరుగులతో దుమ్మురేపాడు. ఇక అంతకముందు బ్యాటింగ్ చేసిన 68 పరుగులకే ఆర్సీబీ కుప్పకూలింది. జానెసన్,నటరాజన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలాడారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
64 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. 47 పరుగులు చేసిన అభిషేక్ శర్మ..హర్షల్ పటేల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
6 ఓవర్లకు ఎస్ఆర్హెచ్ స్కోర్ 56/0. క్రీజులో విలియమ్సన్(8), అభిషేక్ శర్మ(46) ఉన్నారు
69 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ రెండు ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్, అభిషేక్ శర్మ ఉన్నారు.
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరగుతోన్న మ్యాచ్‌లో 68 పరుగులకే ఆర్సీబీ కుప్పకూలింది. జానెసన్,నటరాజన్ దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలాడారు. జానెసన్, నటరాజన్ చెరో మూడు వికెట్లు సాధించగా, సుచిత్ రెండు, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ తలా వికెట్ సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో సుయాష్ ప్రభుదేసాయి 15 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
55 పరుగులకే ఆర్సీబీ 8 వికెట్లు కోల్పోయింది. నటరాజన్ బౌలింగ్‌లో హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డయ్యాడు.13 ఓవర్లకు ఆర్సీబీ స్కోర్ 57/8
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఆర్సీబీ పీకల్లోతు కష్టాల్లో పడింది. సుచిత్ బౌలింగ్‌లో దినేష్ కార్తీక్ స్టంపౌటయ్యాడు.
47 పరుగుల వద్ద ఆర్సీబీ ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగులు చేసిన ప్రభుదేసాయి.. సుచిత్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు.
20 పరుగుల వద్ద ఆర్సీబీ నాలుగో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన మాక్స్వెల్.. నటరాజన్ బౌలింగ్‌లో విలియమ్సన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 8 పరుగలకే డుప్లెసిస్, విరాట్ కోహ్లి,అనుజ్ రావత్ వికెట్లు కోల్పోయింది. జాన్సెన్ వేసిన రెండో ఓవర్లో ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. కాగా ఈ సీజన్లో వరుసగా రెండో సారి గోల్డన్ డక్‌గా వెనుదిరిగాడు.
ఐపీఎల్-2022లో శనివారం జరగున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్తో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎస్ఆర్హెచ్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు మార్పులేమి లేకుండా బరిలోకి దిగుతున్నాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, జగదీశ సుచిత్, భువనేశ్వర్ కుమార్, మార్కో జాన్సెన్, ఉమ్రాన్ మాలిక్, టి. నటరాజన్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), అనుజ్ రావత్, విరాట్ కోహ్లి, గ్లెన్ మాక్స్వెల్, సుయాష్ ప్రభుదేసాయి, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, మహ్మద్ సిరాజ్