Breadcrumb
Live Updates
IPL 2022: సీఎస్కే వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ లైవ్ అప్డేట్స్
లూయిస్ విధ్వంసం.. లక్నో సూపర్ జెయింట్స్ బోణీ
సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఎవిన్ లూయిస్ 23 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు సాధించగా.. అంతకముందు డికాక్ 61 పరుగులు, కేఎల్ రాహుల్ 40 పరుగులు చేశారు. సీఎస్కే బౌలర్లలో డ్వేన్ ప్రిటోరియస్ 2, డ్వేన్ బ్రావో, తుషార్ దేశ్‌పాండే తలా ఒక వికెట్ తీశారు.
మనీష్ పాండే(5) ఔట్.. రెండో వికెట్ డౌన్
లక్నో సూపర్‌జెయింట్స్ మనీష్ పాండే(5) రూపంలో రెండో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో బ్రావోకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 12 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. డికాక్ 53, ఎవిన్ లూయిస్ 5 పరుగులతో ఆడుతున్నారు.
కేఎల్ రాహుల్(40) ఔట్.. తొలి వికెట్ కోల్పోయిన లక్నో..
కేఎల్ రాహుల్(40)రూపంలో లక్నో సూపర్ జెయింట్స్ తొలి వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 106 పరుగులు చేసింది. డికాక్ 52, మనీష్ పాండే 5 పరుగులతో ఆడుతున్నారు.
దాటిగా ఆడుతున్న లక్నో సూపర్ జెయింట్స్.. 9 ఓవర్లలో 90/0
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్‌జెయింట్స్ ధీటుగా బదులిస్తుంది. 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 90 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ 48, కేఎల్ రాహుల్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు.
టార్గెట్ 211.. 5 ఓవర్లలో లక్నో స్కోరు 51/0
211 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 51 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 18, డికాక్ 28 పరుగులతో క్రీజులో ఉన్నారు.
సీఎస్కే భారీ స్కోరు.. లక్నో సూపర్ జెయింట్స్ లక్ష్యం 211
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోరు చేసింది. శివమ్ దూబే 49 పరుగులతో మెరుపులు మెరిపించగా.. ధోని ఆఖర్లో(6 బంతుల్లో 16, 2 ఫోర్లు, ఒక సిక్స్) తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఊతప్ప 50, శివమ్ దూబే 49, మొయిన్ అలీ 35 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో ఆవేశ్ ఖాన్, ఆండ్రూ టై, రవి బిష్ణోయి తలా రెండు వికెట్లు తీశారు.
భారీ స్కోరు దిశగా సీఎస్కే
లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే భారీ స్కోరు దిశగా పరుగులు తీస్తోంది. 18 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. శివమ్ దూబే 47, జడేజా 12 పరుగుతలతో ఆడుతున్నారు. అంతకముందు 27 పరుగులు చేసిన రాయుడు రవి బిష్ణోయి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
14 ఓవర్లలో సీఎస్కే 136/3
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్కే 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. శివమ్ దూబే 30, అంబటి రాయుడు 12 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముంఉద రాబిన్ ఊతప్ప 50, మొయిన్ అలీ 35 పరుగులు చేసి ఔటయ్యారు.
మూడో వికెట్ కోల్పోయిన సీఎస్కే.. మొయిన్ అలీ ఔట్
సీఎస్కే మూడో వికెట్ కోల్పోయింది. 35 పరుగులు చేసిన మొయిన్ అలీ.. అవేష్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. 11 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది.
రెండో వికెట్ కోల్పోయిన సీఎస్కే
84 పరుగుల వద్ద సీఎస్కే రెండో వికెట్ కోల్పోయింది. 50 పరుగులు చేసిన రాబిన్ ఊతప్ప.. బిష్ణోయి బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసే సరికి సీఎస్కే రెండు వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది.
సీఎస్కే దూకుడు.. 6 ఓవర్లలో 73/1
రుతురాజ్ ఒక్క పరుగుకే వెనుదిరిగినప్పటికి.. సీఎస్కే దూకుడైన ఆటతీరు కనబరుస్తోంది. తొలి పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసేసరికి వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 45, మొయిన్ అలీ 21 పరుగులతో ఆడుతున్నారు.
రుతురాజ్ రనౌట్.. తొలి వికెట్ కోల్పోయిన సీఎస్కే
రుతురాజ్ గైక్వాడ్(1) రూపంలో సీఎస్కే తొలి వికెట్ కోల్పోయింది. ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా గైక్వాడ్ షాట్ ఆడాడు. అయితే సింగిల్ కోసం ప్రయత్నించి రవి బిష్ణోయి డైరెక్ట్ త్రోకు రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం సీఎస్కే 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులు చేసింది. ఊతప్ప 21. మొయిన్ అలీ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.
2 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే స్కోరు 26/0
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ను సీఎస్కే ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించింది. ప్రస్తుతం 2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. రాబిన్ ఊతప్ప 20, రుతురాజ్ గైక్వాడ్ 1 పరుగతో క్రీజులో ఉన్నారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
ఐపీఎల్ 2022లో భాగంగా గురువారం సీఎస్కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఆసక్తికర పోరు ప్రారంభమైంది. టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఇరుజట్లు తలపడడం ఇదే తొలిసారి.
కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఓటమి పాలవ్వగా.. అటు గుజరాత్ టైటాన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ పరాజయం చవిచూసింది. మరి ఈ రెండు జట్లలో విజయం ఎవరిని వరిస్తుంది.. ఎవరు బోణీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Related News By Category
Related News By Tags
-
సీఎస్కే, రవీంద్ర జడేజా మధ్య విబేధాలు.. ఎస్ఆర్హెచ్ బాటలోనేనా!
సీఎస్కే యాజమాన్యం, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాల మధ్య విబేధాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ధోని స్థానంలో జట్టును నడిపించడంలో విఫలమైన జడ్డూపై సీఎస్కే గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అందుకు తగ్గట్లే సీఎస్...
-
జడ్డూనే తప్పుకున్నాడా.. బలవంతంగా తప్పించారా?!
సీఎస్కే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు తెలిపి రవీంద్ర జడేజా అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందే ధోని కెప్టెన్‌గా తప్పుకోవడంతో సీఎస్కే మేనేజ్మెంట్ జడ...
-
జడేజా సంచలన నిర్ణయం.. సీఎస్కే కొత్త కెప్టెన్ ఎవరంటే?
సీఎస్కే కెప్టెన్ రవీంద్ర జడేజా సంచలన నిర్ణయం తీసుకున్నాడు.ఐపీఎల్ 2022 సీజన్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జడేజా నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ఎంఎస్ ధోనికి అప్పగిస్తున్నట్లు తెలిప...
-
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్.. తీవ్ర దిగ్బ్రాంతిలో లక్నో సూపర్ జెయింట్స్
పంజాబ్ కింగ్స్‌తో శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందే లక్నో జట్టుకు బిగ్‌షాక్ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్ సీఈవో రఘు అయ్యర్ కార్...
-
ఐపీఎల్ నిబంధన ఉల్లంఘన.. కేఎల్ రాహుల్‌కు భారీ జరిమానా
లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు ఊహించని షాక్ తగిలింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ నిబంధనలను అతిక్రమించిన కారణంగా కేఎల్ రాహుల్ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత విధిస్తున్నట్లు ఐప...