Bhuvaneshwar Kumar: చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్‌ అరుదైన రికార్డు

IPL 2022: Bhuvneshwar Kumar Stands 1st Place Most Dot Balls IPL History - Sakshi

ఐపీఎల్‌ 2022లో తొలి మ్యాచ్‌లోనే ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. రాజస్తాన్‌ రాయల్స్‌తో తమ తొలి మ్యాచ్‌లో దాదాపు ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లందరూ దారాళంగా పరుగులిచ్చుకున్నారు. తొలి స్పెల్‌లో నోబాల్స్‌ వేసినప్పటికి అద్బుత స్పెల్‌ వేసిన భువనేశ్వర్‌ మలి స్పెల్‌లో అదే జోరును చూపెట్టలేకపోయాడు. సంజూ శాంసన్‌, హెట్‌మైర్‌ల దాటికి భువీ భారీగా పరుగులిచ్చుకున్నాడు. అయితే ఇంత చెత్త బౌలింగ్‌లోనూ భువనేశ్వర్‌ అరుదైన రికార్డు సాధించాడు.

ఐపీఎల్‌లో అత్యధిక డాట్‌ బంతులు వేసిన బౌలర్‌గా భువనేశ్వర్‌ అగ్రస్థానంలో నిలిచాడు. తాజాగా రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి 29 పరుగులిచ్చి ఒక వికెట్‌ తీశాడు. కాగా ఇందులో 12 డాట్‌బాల్స్‌ ఉండడం విశేషం. ఇక ఐపీఎల్‌లో భువనేశ్వర్‌ ఇప్పటివరకు 133 మ్యాచ్‌ల్లో 1338 డాట్‌ బాల్స్‌ వేసి అగ్రస్థానంలో ఉన్నాడు. రెండో స్థానంలో హర్భజన్‌ సింగ్‌ 163 మ్యాచ్‌ల్లో 1314 డాట్‌ బాల్స్‌తో రెండో స్థానంలో.. రవిచంద్రన్‌ అశ్విన్‌ 167 మ్యాచ్‌ల్లో 1293 డాట్‌ బాల్స్‌తో మూడో స్థానంలో ఉన్నాడు. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే రాజస్తాన్‌ రాయల్స్‌ భారీ స్కోరు సాధించింది. కెప్టెన్‌ సంజూ శాంసన్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌(27 బంతుల్లో 55) కు తోడు చివర్లో హెట్‌మైర్‌(13 బంతుల్లో 32) మెరుపులు మెరిపించడంతో రాజస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ 41, బట్లర్‌ 35 పరుగులతో జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించారు.  

చదవండి: IPL 2022: వికెట్ల కోసం కాకుండా నో బాల్స్‌కు పోటీ పడ్డారు.. ఎంతైనా ఎస్‌ఆర్‌హెచ్‌ కదా 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top