
రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనున్న భారత మహిళల ఫుట్‌బాల్ జట్టు
ప్రాబబుల్స్‌లో సౌమ్య గుగులోత్
న్యూఢిల్లీ: ఈ నెలాఖరులో భారత సీనియర్ మహిళల ఫుట్‌బాల్ జట్టు ఉజ్బెకిస్తాన్‌తో రెండు అంతర్జాతీయ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. మే 30వ తేదీన తొలి మ్యాచ్... జూన్ 3వ తేదీన రెండో మ్యాచ్ జరుగుతుంది. బెంగళూరులోని పడుకోన్–ద్రవిడ్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్‌లెన్స్ ఈ రెండు మ్యాచ్‌లకు వేదిక కానుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం భారత జట్టు 69వ ర్యాంక్‌లో, ఉజ్బెకిస్తాన్ 50వ ర్యాంక్‌లో ఉన్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు 13 సార్లు తలపడ్డాయి. తొమ్మిది మ్యాచ్‌ల్లో ఉజ్బెకిస్తాన్, ఒక మ్యాచ్‌లో భారత్ గెలిచాయి.
మరో మూడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రస్తుతం భారత జట్టు హెడ్ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి పర్యవేక్షణలో 2026 ఆసియా కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు సిద్ధమవుతోంది. మే 1 నుంచి జరుగుతున్న శిక్షణ శిబిరంలో భారత క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. ఈ శిబిరంలో తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్ కూడా ఉంది.
ఈ సీజన్‌లో సౌమ్య నిలకడగా రాణించి 2025 సంవత్సరానికి భారత ఉత్తమ మహిళా ఫుట్‌బాలర్ అవార్డును గెల్చుకుంది. ఆసియా కప్ క్వాలిఫయింగ్ టోర్నీ జూన్ 23 నుంచి జూలై 5వ తేదీ వరకు థాయ్‌లాండ్‌లో జరగనుంది. గ్రూప్ ‘బి’లో మంగోలియా, తిమోర్‌లెస్టె, ఇరాక్, థాయ్‌లాండ్ జట్లతో కలిసి భారత్ ఉంది.
భారత ప్రాబబుల్స్: పాయల్, ఎలాంగ్‌బమ్ పంథోయ్ చాను, కీషమ్ మెలోడి చాను, మోనాలిసా దేవి, పూరి్ణమ కుమారి, నిర్మలా దేవి, మారి్టనా థోక్‌చోమ్, శుభాంగి సింగ్, సంజు, మాలతి ముండా, తోయ్‌జామ్ థోయ్‌బిసనా చ ఆను, రంజన చాను, స్వీటీ దేవి, వికసిత్ బరా, హేమం షిల్కీ దేవి, కిరణ్ పిస్డా, రత్నబాలా దేవి, ముస్కాన్ సుబ్బా, లిషామ్ బబీనా దేవి, కార్తీక అంగముత్తు, సిండీ కల్నే, సంగీత బస్ఫోరె, ప్రియదర్శిని, బేబీ సనా, సంతోష్, అంజు తమాంగ్, మౌసుమి ముర్ము, మాళవిక, సంధ్య రంగనాథన్, సౌమ్య గుగులోత్, సులాంజన రౌల్, లిండా కోమ్ సెర్టో, రింపా హల్దర్, మనీషా నాయక్, రేణు, కరిష్మా పురుషోత్తం, సుమతి కుమారి, మనీషా కల్యాణ్, గ్రేస్ డాంగ్మె.