
రాయగడ: ఉత్కళాంధ్రుల ఆరాధ్య దైవంగా పూ�...
పాల నురుగులా తెల్లగా ఉండాలంటే మేనుకి...
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు.. హిమాచల్...
ప్రముఖ వ్యాపారవేత్త, హీరో రామ్చరణ్...
ప్రముఖ టీవీ నటుడు బడే అచ్చే లగ్తే హై ఫ...
సాక్షి, ఆంధ్రప్రదేశ్: దివంగత ముఖ్యమ�...
ఎన్నికల వేళ.. బీహార్లో రాజకీయంగానూ క�...
మనం సాదాసీదాగా చూసే పాములు వాటి తీరు�...
సాక్షి, హైదరాబాద్: వయసు పెరిగే కొద్ద�...
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ సీనియ�...
పార్కిన్సన్స్ వ్యాధి కాస్త వయసు పె...
లక్నో: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన వెల�...
తమిళనాడు ఘోర ప్రమాదం సంభవించింది. కడ�...
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అ...
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్�...
Mar 14 2022 1:54 PM | Updated on Mar 14 2022 6:07 PM
పింక్ బాల్ టెస్టులో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన పింక్ బాల్ టెస్టులో 238 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2 మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0తేడాతో భారత్ కైవసం చేసుకుంది. 447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకు ఆలౌటైంది. శ్రీలంక బ్యాటర్లలో కెప్టెన్ కరుణరత్నే సెంచరీతో మెరిశాడు. ఇక భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..బుమ్రా మూడు, అక్షర్ పటేల్ రెండు వికెట్లు సాధించారు.
అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. అదే విధంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగలకే కుప్ప కూలింది. 143 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన 303-9 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యం కలుపుకుని శ్రీలంకకు 447 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఇక రెండు ఇన్నింగ్స్ల్లోను భారత బ్యాటర్ శ్రేయస్ అద్భుతంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్లో 92 పరుగులు చేసిన అయ్యర్.. రెండో ఇన్నింగ్స్లో 67 పరుగులు సాధించింది. కాగా రోహిత్ శర్మకు కెప్టెన్గా తొలి టెస్టు విజయం.
47 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. క్రీజులో కరుణరత్నే(84), ఆసలంక(4) పరుగులతో ఉన్నారు.
160 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ కోల్పోయింది. 15 పరుగలు చేసిన డిక్ వాలా.. అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా పెవిలియన్కు చేరాడు.
105 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో విహారికి క్యాచ్ ఇచ్చి డిసిల్వా (4) ఔటయ్యాడు. క్రీజ్లో కురణరత్నే (40), డిక్వెల్లా ఉన్నారు.
శ్రీలంక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన మథ్యూస్.. జడేజా బౌలింగ్లో క్లీన్ బౌల్డయ్యాడు.
97 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. 54 పరుగులు చేసిన మెండిస్.. అశ్విన్ బౌలింగ్లో స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. 16 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక రెండు వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది.
మూడో రోజు ఆట మొదలు పెట్టిన శ్రీలంక నిలికడగా ఆడుతుంది. 16 ఓవర్లకు శ్రీలంక స్కోర్: 74/1
447 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మూడో రోజు ఆటను మొదలు పెట్టింది. క్రీజులో కుశాల్ మెండిస్, కురుణరత్నే ఉన్నారు.