
బర్మింగ్‌హామ్: వచ్చే ఏడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో (సీడబ్ల్యూజీ) అరంగేట్రం చేయనున్న మహిళల క్రికెట్ ఆరంభ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. జూలై 29 నుంచి ఆగస్టు 7 వరకు క్రికెట్ ఈవెంట్ జరుగుతుంది. మొత్తం 8 జట్లు బరిలో ఉండగా... వీటిని రెండు గ్రూప్‌లుగా విభజిం చారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్ ఉండగా... గ్రూప్ ‘బి’లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, క్వాలిఫయర్ జట్లు ఉన్నాయి. జూలై 31న పాకిస్తాన్‌తో భారత్ తలపడనుంది.
ఆగస్టు 3న బార్బడోస్‌తో భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌ను ఆడనుంది. లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాక రెండు గ్రూప్‌ల్లోనూ టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్ మ్యాచ్‌లు ఆగస్టు 6న జరుగుతాయి. సెమీస్‌లో విజేతగా నిలిచిన జట్లు ఆగస్టు 7న పసిడి పతకం కోసం... ఓడిన జట్లు అదే రోజు కాంస్య పతకం కోస పోటీ పడతాయి. మ్యాచ్‌లన్నీ టి20 ఫార్మాట్‌లో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరగనున్నాయి.