కరోనాతో వేద కృష్ణమూర్తి తల్లి మృతి | India Cricketer Veda Krishnamurthys Mother Dies Of COVID-19 | Sakshi
Sakshi News home page

కరోనాతో భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి తల్లి మృతి

Apr 25 2021 4:41 AM | Updated on Apr 25 2021 5:21 AM

India Cricketer Veda Krishnamurthys Mother Dies Of COVID-19 - Sakshi

సాక్షి, బెంగళూరు: భారత మహిళా క్రికెటర్‌ వేద కృష్ణమూర్తి ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. కరోనా వైరస్‌ బారిన పడిన వేద కృష్ణమూర్తి తల్లి చెలువాంబ్డా దేవి శనివారం తుదిశ్వాస విడిచారు. వేద సోదరి కూడా ప్రస్తుతం కరోనా వైరస్‌తో పోరాడుతున్నారు. ‘అమ్మ మరణంతో మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. ఇప్పుడు మా సోదరి క్షేమంగా, ఆరోగ్యంగా ఇంటికి తిరిగి రావాలని ప్రార్థిస్తున్నాను’ అని వేద వ్యాఖ్యానించింది. 28 ఏళ్ల వేద భారత మహిళల జట్టు తరఫున 48 వన్డేలు ఆడి 829 పరుగులు... 76 టి20 మ్యాచ్‌లు ఆడి 875 పరుగులు సాధించింది.    

Advertisement
 
Advertisement
Advertisement