Ind Vs WI 2nd T20: ఎవరికి ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసు: భువీ ప్రశంసలు

Ind Vs WI: Bhuvneshwar Lauds Arshdeep He Knows Exactly What Is Required - Sakshi

West Indies vs India, 2nd T20I: టీమిండియా యువ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌పై సహచర ఆటగాడు, సీనియర్‌ పేసర్‌ భునవేశ్వర్‌ ప్రశంసలు కురిపించాడు. ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్‌ చేయాలో అతడికి బాగా తెలుసన్నాడు. యువ ఆటగాళ్లలో చాలా తక్కువ మందిలో మాత్రమే ఇలాంటి పరిణతి ఉంటుందంటూ అర్ష్‌దీప్‌ను కొనియాడాడు. కాగా ఐపీఎల్‌-2022లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అర్ష్‌దీప్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

అరంగేట్రంలోనే అదరగొట్టాడు!
పంజాబ్‌కు ఆడిన ఈ 23 ఏళ్ల ఫాస్ట్‌బౌలర్‌ 14 ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో బీసీసీఐ నుంచి పిలుపు అందుకున్న అర్ష్‌దీప్‌.. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. మొత్తంగా.. 3.3 ఓవర్లు వేసి కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. తద్వారా క్రికెట్‌ విశ్లేషకుల దృష్టిని ఆకర్షించాడు. 


అర్ష్‌దీప్‌ అరంగేట్రం(PC: BCCI)

ఈ క్రమంలో వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ట్రినిడాడ్‌ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్‌లో 2 వికెట్లతో సత్తా చాటాడు. అదే జోష్‌లో సోమవారం నాటి(ఆగష్టు 1)రెండో టీ20కి సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు ముందు భువీ మాట్లాడుతూ.. అర్ష్‌దీప్‌ ఆటతీరును ప్రశంసించాడు.

అర్ష్‌దీప్‌నకు ఆ విషయం బాగా తెలుసు!
‘‘ఎప్పుడు ఎలా ఆడాలో తనకు బాగా తెలుసు. అతడిలో ఉన్న అత్యుత్తమ గుణం ఇదే! ఏ బ్యాటర్‌కు ఎలా బౌలింగ్‌ చేయాలి? ఫీల్డ్‌ ఎలా సెట్‌ చేసుకోవాలి? అన్న విషయాలు బాగా తెలుసు. యువ ఆటగాళ్లలో చాలా కొంతమంది మాత్రమే ఇలాంటి పరిణతి కనబరచగలరు’’ అని భువీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌ గత రెండు సీజన్లలోనూ అర్ష్‌దీప్‌ నిలకడగా రాణించాడన్న భువీ.. పరిస్థితులకు తగ్గట్లుగా తనను తాను మలచుకోవడంలో ముందుంటాడని కొనియాడాడు.

చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు
India Probable XI: అలా అయితే అయ్యర్‌పై వేటు తప్పదు! ఓపెనర్‌గా మళ్లీ అతడే!?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top