Ind Vs Sa 2nd Test: వరుణుడు కూడా కాపాడలేకపోయాడు.. రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి

Ind Vs Sa 2nd Wanderers Test: Day 4 Updates And Highlights In Telugu - Sakshi

Ind Vs Sa 2nd Test Day 4 Updates:

వరుణుడు కూడా కాపాడలేకపోయాడు.. రెండో టెస్ట్‌లో టీమిండియా ఓటమి
9: 23 PM: చేతిలో 8 వికెట్లు, 122 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు వరుణుడు స్వాగతం పలికాడు. దీంతో తొలి రెండు సెషన్ల ఆట పూర్తిగా రద్దైంది. మూడో సెషన్‌ సమయానికి వర్షం​ ఆగిపోవడంతో ఆట ప్రారంభమైంది. సెషన్‌ ఆరంభంలోనే డెస్సన్‌(40) వికెట్‌ తీసిన షమీ టీమిండియా శిబిరంలో ఆశలు రెకెత్తించాడు. అయితే, కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌(96), బవుమా(23) సహకారంతో దక్షిణాఫ్రికాకు అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోవైపు, ఎలాగైనా ఈ టెస్ట్‌లో గెలిచి సఫారీ గడ్డపై చరిత్ర సృష్టిద్దామనుకున్న టీమిండియా ఆశలు అడియాశలు అయ్యాయి. 

స్కోర్‌ వివరాలు:
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 202 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 266 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:  229 ఆలౌట్‌   
రెండో ఇన్నింగ్స్‌: 243/3

మూడో వికెట్‌ కోల్పోయిన దక్షిణాఫ్రికా.. లక్ష్యానికి మరో 65 పరుగుల దూరంలో
8: 19 PM: 122 పరుగుల లక్ష్యంతో నాలుగో రోజు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా.. మూడో సెషన్‌లో ఆఖర్లో మూడో వికెట్‌ కోల్పోయింది.  షమీ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి డస్సెన్‌(40) ఔటయ్యాడు. ఆతిధ్య జట్టు లక్ష్యానికి మరో 65 పరుగుల దూరంలో ఉంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోర్‌ 175/3. క్రీజ్‌లో ఎల్గర్‌(59), బవుమా ఉన్నారు.

7: 11 PM: వరుణుడు కరుణించడంతో నాలుగో రోజు ఆట ఎట్టకేలకు మొదలైంది. 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టు.. బుమ్రా  వేసిన తొలి ఓవర్‌లో 2 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌ టీమిండియా గెలవాలంటే 8 వికెట్లు, సఫారీ జట్టు విజయం సాధించాలంటే మరో 120 పరుగులు సాధించాల్సి ఉంది. క్రీజ్లో ఎల్గర్‌(46), డస్సెన్‌(11) ఉన్నారు.  

4: 22 PM: జొహన్నస్‌బర్గ్‌లో వాతావరణాన్ని గమనిస్తే ఈరోజు ఆట ఆరంభమయ్యే పరిస్థితి కనబడటం లేదు. వర్షం కురుస్తూనే ఉంది. దీంతో నాలుగో రోజు ఆట రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

3: 38 PM: వరణుడు కరుణించడం లేదు. వర్షం కారణంగా టీమిండియా- దక్షిణాఫ్రికా మొదలు కావాల్సిన నాలుగో రోజు ఆట ఆలస్యమవుతోంది. ఒక్క బంతి కూడా పడకుండానే జట్లు లంచ్‌ బ్రేక్‌కు వెళ్లాయి.

1: 30 PM: భారత్‌- దక్షిణాఫ్రికా రెండో టెస్ట్‌లో భాగంగా నాలుగో రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. చిరుజల్లులు పడుతుండటంతో మ్యాచ్‌ ఆలస్యం కానుంది. ఇక మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌(46)  డసెన్‌ (11‌) క్రీజ్‌లో ఉన్నారు. భారత్‌ ఈ మ్యాచ్‌లో గెలిచి సఫారీ గడ్డపై సిరీస్‌ విజయం సాధించాలంటే ఎనిమిది వికెట్లు పడగొట్టాల్సి ఉంది.

వాండరర్స్‌ టెస్టు
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌: 202 ఆలౌట్‌
రెండో ఇన్నింగ్స్‌: 266 ఆలౌట్‌

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌:  229 ఆలౌట్‌

తుది జట్లు:
భారత్‌:

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానే, హనుమ విహారి, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, మహ్మద్‌ షమీ, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌

సౌతాఫ్రికా:
డీన్‌ ఎల్గర్‌(కెప్టెన్‌), ఎయిడెన్‌ మార్కరమ్‌, కీగన్‌ పీటర్సన్‌, రసే వాన్‌ డెర్‌ డసెన్‌, తెంబా బవుమా, కైలీ వెరెనె(వికెట్‌ కీపర్‌), మార్కో జాన్‌సెన్‌, కగిసో రబడ, కేశవ్‌ మహరాజ్‌, డువానే ఒలివర్‌, లుంగి ఎంగిడి.

చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top