ఎట్టకేలకు ‘24’ను బ్రేక్‌ చేశారు..

Ind Vs Eng: India Achieves New Record With 25 LBW Dismissals - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమిండియా ఒక అరుదైన రికార్డును లిఖించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో టీమిండియా సిరీస్‌ను 3-1తో గెలుచుకోవడమే కాకుండా డబ్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరింది. ఇంగ్లండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూల్చి ఇన్నింగ్స్‌ విజయాన్ని అందుకుంది టీమిండియా.  కాగా,  ఈ సిరీస్‌లో టీమిండియా బౌలర్లు 25 మందిని ఎల్బీలుగా ఔట్‌ చేశారు. ఇదే టీమిండియా తరఫున అత్యధికంగా నమోదైంది. గతంలో రెండు సందర్భాల్లో టీమిండియా బౌలర్లు 24 వికెట్లను ఎల్బీల రూపంలో సాధించారు. 40 ఏళ్ల క్రితం ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో భారత బౌలర్లు 24 ఎల్బీలు చేయగా, 2016-17లో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో 24 మందిని వికెట్లు ముందు దొరకబుచ్చుకున్నారు. కాగా, దాన్ని ఎట్టకేలకు బ్రేక్‌ చేశారు టీమిండియా బౌలర్లు.  అదే సీజన్‌లో న్యూజిలాండ్‌ జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 22 మందిని ఎల్బీలుగా పెవిలియన్‌కు పంపింది. టీమిండియా తరపున టాప్‌-4 జాబితాలో ఇవి ఉండగా, తాజా సిరీస్‌లో ఎల్బీలు అగ్రస్థానాన్ని ఆక్రమించాయి. ఇక్కడ చదవండి: టీమిండియా మూడోసారి..

ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది.  దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం లభించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవసం​ చేసుకుని  జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడటానికి సిద్ధమైంది.   ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది. రిషభ్‌ పంత్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా, అశ్విన్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కింది.  కాగా, అశ్విన్‌30వ సారి ఐదు వికెట్ల మార్కును చేరడం విశేషం. ఇక్కడ చదవండి: టీమిండియా విజయం.. సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top