Ind Vs Aus: కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు! రోహిత్‌ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు! ఇంత ఘోరమా?

Ind Vs Aus: Wicketless Session Under Kohli 2 In 7 Years Rohit 2 In Last 24 hours - Sakshi

India vs Australia, 4th Test- Rohit Sharma- Virat kohli: భారత గడ్డపై మూడో టెస్టును రెండున్నరోజుల్లోనే ముగించిన ఆస్ట్రేలియా నాలుగో టెస్టులోనూ పట్టు బిగిస్తోంది. తొలి రెండు మ్యాచ్‌లలో సునాయాసంగా నెగ్గిన రోహిత్‌ సేనకు ఊహించని రీతిలో షాకిస్తోంది. ఇండోర్‌ విజయంతో నేరుగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన కంగారూ జట్టు.. టీమిండియా అవకాశాలపై నీళ్లు చల్లాలని ఉవ్విళ్లూరుతోంది.

బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో భారత జట్టు ఆధిక్యాన్ని తగ్గించి.. సమం చేయాలని ఆశపడుతోంది. అందుకు తగినట్లుగానే అహ్మబాదాబాద్‌లో ఆసీస్‌ బ్యాటర్లు పట్టుదలగా నిలబడి సెంచరీలతో రెచ్చిపోయారు. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2024లో టీమిండియాతో మార్చి 9న మొదలైన ఆఖరి టెస్టులో తొలిరోజే ఉస్మాన్‌ ఖవాజా శతకం బాదగా.. ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌ 49 పరుగులతో క్రీజులో నిలిచాడు.

ఒక్క వికెట్‌ కూడా తీయలేక
ఈ క్రమంలో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో కూడా ఆధిపత్యం చెలాయిస్తోంది. తొలి రోజు మాదిరి రెండో రోజు కూడా.. ఎంత ప్రయత్నించినా టీమిండియా బౌలర్లు తొలి సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయారు.

ఆఖరికి అశ్విన్‌.. సెంచరీ హీరో కామెరాన్‌ గ్రీన్‌(114)ను అవుట్‌ చేయడం ద్వారా భారత్‌కు రెండోరోజు తొలి వికెట్‌ దక్కింది. ఆ తర్వాత వరుసగా అశ్విన్‌ మరో రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఖవాజా(180)ను అవుట్‌ చేసి మరో బిగ్‌బ్రేక్‌ ఇచ్చాడు. అయితే, అప్పటికే ఆస్ట్రేలియా 400 పైచిలుకు మార్కు అందుకుని పటిష్ట స్థితిలో నిలిచింది.

ఇదిలా ఉంటే.. ఇండోర్‌, అహ్మదాబాద్‌ టెస్టుల్లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అక్షర్‌ పటేల్‌ చేతికి బంతినివ్వకపోవడంపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక టీ బ్రేక్‌ ముగియగానే అక్షర్‌ రంగంలోకి దిగిన వెంటనే ఖవాజా రూపంలో కీలక వికెట్‌ తీశాడు.

ఆ సమయంలో ఎల్బీడబ్ల్యూ విషయంలోనూ రోహిత్‌ మిన్నకుండిపోగా.. ఛతేశ్వర్‌ పుజారా రివ్యూ కోరమని చెప్పగా అనుకూల ఫలితం వచ్చింది. ఈ నేపథ్యంలో రోహిత్‌ శర్మపై నెట్టింట ట్రోల్స్‌ మొదలయ్యాయి. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీతో రోహిత్‌ను పోల్చి చూస్తూ నెటిజన్లు రోహిత్‌పై సెటైర్లు పేలుస్తున్నారు.

కోహ్లి కెప్టెన్సీలో అలా.. రోహిత్‌ కెప్టెన్సీలో ఇలా
సొంతగడ్డపై టెస్టు మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయకుండా సెషన్‌ ముగియడం కోహ్లి కెప్టెన్సీలో ఏడేళ్లలో రెండుసార్లు జరుగగా.. రోహిత్‌ శర్మ సారథ్యంలో 24 గంటల్లోనే రెండుసార్లు జరగడం గమనార్హం.

ఈ గణాంకాలను హైలైట్‌ చేస్తూ రోహిత్‌ను ఆడుకుంటున్నారు నెటిజన్లు!! ఏదేమైనా ఈ టెస్టులో ఫలితం టీమిండియాకు అనుకూలంగా రాకుంటే మాత్రం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

చదవండి: IND Vs AUS: 'వెళ్లి క్షమాపణ చెప్పు'.. కేఎస్‌ భరత్‌కు కోహ్లి ఆదేశం
Ind Vs Aus: గ్రౌండ్‌లోనే ఇషాన్‌పై చెయ్యెత్తిన రోహిత్‌.. సర్వెంట్‌ అనుకున్నావా! అయినా ప్రతిదానికీ..
Ind vs Aus: చెలరేగిన అశ్విన్‌.. ఒకే ఓవర్లో రెండు వికెట్లు! సెంచరీ హీరో అవుట్‌.. ఇంకా! వీడియో వైరల్‌
23 ఏళ్ల తర్వాత తొలిసారి ఆస్ట్రేలియా.. అంతా వాళ్ల వల్లే! అదే జరిగితే టీమిండియా..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top