ఐసీసీ సంచలన ప్రకటన.. ఆ టోర్నీలో భారత్‌కు నో ఛాన్స్‌ | ICC Announces New Tournament With No India Matches | Sakshi
Sakshi News home page

ఐసీసీ సంచలన ప్రకటన.. ఆ టోర్నీలో భారత్‌కు నో ఛాన్స్‌

Apr 17 2026 2:08 PM | Updated on Apr 17 2026 2:43 PM

ICC Announces New Tournament With No India Matches

జై షా నాయ‌క‌త్వంలోని అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) చారిత్రత్మక నిర్ణ‌యం తీసుకుంది. మ‌హిళల‌ టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2026కు ముందు స‌రికొత్త టీ20 టోర్న‌మెంట్‌ను ఐసీసీ ప్ర‌క‌టించింది. ఇందుకు ఐసీసీ టీ20 ఛాలెంజ్‌గా నామ‌క‌ర‌ణం చేశారు. అసోసియేట్ దేశాలకు చెందిన జ‌ట్ల‌కు తగిన గుర్తింపును కల్పించడమే ల‌క్ష్యంగా ఈ టోర్నీని ఐసీసీ నిర్వ‌హించ‌నుంది.

అందుకే ఈ టోర్న‌మెంట్‌లో ఆస్ట్రేలియా, భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ వంటి అగ్రశ్రేణి జట్లు పాల్గొనవు. ఈ చారిత్రాత్మక మొదటి సీజన్ రువాండాలోని కిగాలీ నగరంలో జరగనుంది. ఈ ఐసీసీ టీ20 ఛాలెంజ్ టోర్నీలో మొత్తం 5 జ‌ట్లు పాల్గోనున్నాయి.

ఈ ఐసీసీ ఈవెంట్‌ ఏప్రిల్ 18 నుండి మే 1 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ టోర్నీని డబుల్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ప్రతి జట్టు ఇతర జట్లతో రెండేసి సార్లు తలపడుతుంది. అంటే గ్రూప్ దశలో ఒక్కో జట్టుకు 8 మ్యాచ్‌లు లభిస్తాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు విజేతగా నిలుస్తుంది.

ఈ టోర్నీలో పాల్గోనే జ‌ట్లు ఇవే
నేపాల్ (ఆసియా)

యూఎస్ఎ (అమెరికా)

ఇటలీ (యూరప్)

వనాటు (ఈస్ట్ ఆసియా-పసిఫిక్)

రువాండా (ఆఫ్రికా - ఆతిథ్య జట్టు)
చదవండి: నా భర్త గురించి తప్పుడు ప్రచారం: వినోద్‌ కాంబ్లీ భార్య
 

Advertisement
 
Advertisement
Advertisement