
సాక్షి, హైదరాబాద్: ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) నాలుగో సీజన్‌ను హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ జట్టు పరాజయంతో ముగించింది. గచి్చ»ౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ 9–15, 13–15, 15–9, 13–15తో కోల్‌కతా థండర్‌బోల్ట్స్ జట్టు చేతిలో ఓడిపోయింది. బ్లాక్‌హాక్స్ తరఫున ప్రీత్ కరణ్, సాహిల్ కుమార్, యుదీ యామమోటో రాణించారు. నిర్ణీత ఏడు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ మూడింటిలో గెలిచి, నాలుగింటిలో ఓడి తొమ్మిది పాయింట్లతో ఎనిమిదో స్థానంలో నిలిచి సెమీఫైనల్‌కు దూరమైంది.
మరో మ్యాచ్‌లో కొచ్చి బ్లూ స్పైకర్స్ 15–13, 14–16, 17–15, 15–9తో అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్టును ఓడించింది. ఈ లీగ్‌లో పోటీపడుతున్న మొత్తం పది జట్లను రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో గోవా గార్డియన్స్, చెన్నై బ్లిట్జŠస్, కొచ్చి బ్లూ స్పైకర్స్, బెంగళూరు టొర్పెడస్, కోల్‌కతా థండర్‌బోల్ట్స్... గ్రూప్ ‘బి’లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్, ఢిల్లీ తూఫాన్స్, అహ్మదాబాద్ డిఫెండర్స్, ముంబై మెటియోర్స్, కాలికట్ హీరోస్ జట్లున్నాయి. ఒక్కో జట్టు ఏడు మ్యాచ్‌లు ఆడుతుంది.
ఆయా జట్లు తమ గ్రూప్‌లోని నాలుగు జట్లతో, మరో గ్రూప్‌లోని మూడు జట్లతో మ్యాచ్‌లు ఆడతాయి. లీగ్ దశ ముగిశాక టాప్–4లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే ముంబై మెటియోర్స్, బెంగళూరు టొర్పెడస్, అహ్మదాబాద్ డిఫెండర్స్ జట్లు సెమీఫైనల్ బెర్త్‌లను ఖాయం చేసుకోగా... చివరిదైన నాలుగో బెర్త్ కోసం కోల్‌కతా థండర్‌బోల్ట్స్, ఢిల్లీ తుఫాన్స్, గోవా గార్డియన్స్ జట్లు బరిలో ఉన్నాయి.