
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఈ మెగా టోర్నీ ముంగిట ఆ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్(Jos Butler) గాయపడ్డాడు. అహ్మదాబాద్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో బట్లర్ కుడి చేతి భుజానికి గాయమైంది.
భారత ఇన్నింగ్స్ సందర్భంగా బంతిని ఆపే క్రమంలో జోస్ గాయపడ్డాడు. దీంతో అతడు నొప్పితో విల్లవిల్లాడు. అయితే నొప్పి తీవ్రంగా ఉండడంతో బట్లర్ మైదానాన్ని వీడాడు. అతడు తిరిగి మైదానంలోకి రాలేదు. ఈ క్రమంలో ఇంగ్లండ్ స్టాండిన్ కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్ వ్యవహరిస్తున్నాడు.
అదేవిధంగా బట్లర్‌కు సబ్‌స్ట్యూట్‌గా రెహాన్ ఆహ్మద్ ఫీల్డ్‌లోకి వచ్చాడు. కాగా అద్బుతమైన ఫామ్‌లో ఉన్న బట్లర్ గాయపడటం నిజంగా ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఇప్పటికే యువ ఆటగాడు జాకబ్ బెతల్ గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది అనుమానంగా మారగా.. తాజాగా బట్లర్ గాయం ఇంగ్లండ్ టీమ్ మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.
అయితే బట్లర్ గాయం తీవ్రతపై ఇంగ్లండ్ క్రికెట్ ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ సన్నహాకాల్లో భాగంగా భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌లో ఇంగ్లండ్ తలపడుతున్న సంగతి తెలిసిందే. తొలి రెండు వన్డేల్లో ఇంగ్లండ్ ఘోర పరాభావం చవిచూసింది.
ఈ క్రమంలో ఆహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లీష్ జట్టు భావిస్తోంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా భారత్ అదరగొడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది.
39 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ సెంచరీతో మెరిశాడు. 92 బంతుల్లో తన 7వ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 64 బంతులు ఎదుర్కొన్న గిల్.. 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడితో పాటు శ్రేయస్ అయ్యర్(78), విరాట్ కోహ్లి(52) హాఫ్ సెంచరీలతో రాణించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఇంగ్లండ్ జట్టు:
జోస్ బట్లర్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, లియామ్ లివింగ్‌స్టోన్, జామీ స్మిత్, జామీ ఓవర్టన్, బెన్ డకెట్, బ్రైడన్ కార్స్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జో రూట్
చదవండి: IND vs ENG: శుబ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ప్లేయర్‌గా