పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు | How pole vaulter Baranica Elangovan soared into the record book | Sakshi
Sakshi News home page

పోల్‌వాల్ట్‌లో జాతీయ రికార్డు

Mar 25 2026 7:41 AM | Updated on Mar 25 2026 7:43 AM

How pole vaulter Baranica Elangovan soared into the record book

భువనేశ్వర్‌: తమిళనాడు మహిళా అథ్లెట్‌ బరానిక ఎలంగోవన్‌ పోల్‌వాల్ట్‌లో కొత్త జాతీయ రికార్డు నెలకొలి్పంది. భారత్‌లో మొట్టమొదటి సారిగా జరుగుతున్న ఇండోర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో ఆమె అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన పోల్‌వాల్ట్‌లో ఆమె 4.22 మీటర్లతో ఓవరాల్‌గా (ఇండోర్‌ అవుట్‌ డోర్‌ కలిపి) జాతీయ రికార్డు లిఖించింది. 

గతంలో పోల్‌వాల్ట్‌లో రోజీ మీనా పాల్‌రాజ్‌ 2022లో నెలల్పిన 4.21 మీటర్ల రికార్డును 29 ఏళ్ల బరానిక అధిగమించింది. ఇది రెగ్యులర్‌ అవుట్‌డోర్‌ ఈవెంట్‌ కాగా, భారత్‌లో ఇంతకుముందెన్నడూ ఇండోర్‌ పోటీలే జరగలేదు. ఈ నేపథ్యంలో తొలి ఇండోర్‌ ఈవెంట్‌లోనే ఆమె ఓవరాల్‌ రికార్డును నెలకొల్పినట్లయింది. ఈ పోటీల్లో కేరళకు చెందిన బ్లెస్సీ కుంజుమోన్‌ (3.95 మీ.), మరియా జైసన్‌ (3.38 మీ.) వరుసగా రజత, కాంస్య పతకాలు నెగ్గారు. 

‘ముఖ్యంగా పోల్‌వాల్ట్‌ను గాలి వేగం శాసిస్తుంది. అవుట్‌డోర్‌లో వీచే గాలి వేగంతో పోల్‌వాల్ట్‌ ప్రదర్శన మారుతుంది. అయితే ఇండోర్‌ ఈవెంట్‌లో అలాంటి సమస్యలే లేవు’ అని బరానిక తెలిపింది. మిగతా పోటీల్లో పురుషుల లాంగ్‌జంప్‌లో సారున్‌ పాయసింగ్‌ (7.80 మీ.; ఒరిస్సా) వ్యక్తిగత మెరుగైన్‌ ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. దీంతో ట్రిపుల్‌ జంపర్‌ ప్రవీణ్‌ చిత్రవేల్‌ (7.78మీ.; తమిళనాడు) రజతం లభించింది. ప్రవీణ్‌ సాధారణంగా ట్రిపుల్‌ జంప్‌లో పోటీపడతాడు. అయితే ఇండోర్‌లో ఆ ఈవెంట్‌ లేకపోవడంతో లాంగ్‌జంప్‌లోకి మారాడు. డేవిడ్‌ (7.69 మీ.; రైల్వేస్‌)కు కాంస్యం దక్కింది. 

పరీక్షలు సిద్ధమైన ‘నాడా’ 
ఓ వైపు తొలిరోజు భారత అథ్లెట్లు తొలిసారి ఇండోర్‌ పోటీల్లో పాల్గొంటుండగా... మరోవైపు జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) పరీక్షలు మొదలుపెట్టింది. ‘నాడా’కు చెందిన బృందం ఈవెంట్‌కు వేదికైన కళింగ స్టేడియంలోకి దిగింది. మైదానంలో ఏర్పాటు చేసిన నమూనాల సేకరణ గదిలో అథ్లెట్ల నుంచి రక్త మూత్ర నమూనాల్ని తీసుకుంది.  

ఇతర పోటీల ఫలితాలు 
పురుషుల ఈవెంట్స్‌: 800 మీ పరుగు: 1. మొహమ్మద్‌ అఫ్సల్‌ (ఎయిర్‌ఫోర్స్‌), 2. కళ్యాణ్‌ (కర్ణాటక), 3. సాయన్‌ కర్మాకర్‌ (బెంగాల్‌); 3000 మీ. పరుగు: 1. శివాజీ (రిలయన్స్‌), 2. వినోద్‌ (మధ్యప్రదేశ్‌), 3.రాహుల్‌ కుమార్‌ (ఛత్తీస్‌గఢ్‌); 60 మీ. హర్డిల్స్‌: 1.క్రిషిక్‌ (కర్ణాటక), 2.రాతీశ్‌ (రిలయన్స్‌), 3. ముహమ్మద్‌ లజాన్‌ (జేఎస్‌డబ్ల్యూ); షాట్‌పుట్‌: 1.రవికుమార్‌ (బీఎస్‌ఎఫ్‌), 2.ఆధిశ్‌ గిల్దియాల్‌ (ఉత్తరాఖండ్‌); 3.బాలాజీ (తమిళనాడు). 
మహిళల ఈవెంట్స్‌: 3000 మీ. పరుగు: 1.ప్రియాంక (కర్ణాటక), 2.కాజల్‌ (గుజరాత్‌), 3.అక్షయ (తమిళనాడు); షాట్‌పుట్‌: 1.రేఖ (ఎన్‌సీఓఈ, పాటియాలా), 2.మయూరి (కర్ణాటక); లాంగ్‌జంప్‌: 1. అనామిక (జేఎస్‌డబ్ల్యూ), 2.మనీశా మెరెల్‌ (ఒరిస్సా), 3.శెరిన్‌ 
(జేఎస్‌డబ్ల్యూ).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement