IPL 2021: ఐపీఎల్‌లో హర్షల్ పటేల్ నయా రికార్డు

Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్‌లాడిన హర్షల్ పటేల 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉండడం విశేషం. తద్వారా హర్షల్ పటేల్ సీఎస్‌కే బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు.
2013 ఐపీఎల్‌లో సీఎస్‌కే తరపున ఆ సీజన్‌లో 32 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, ఐపీఎల్ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013 ఐపీఎల్), లసిత్ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది.