IND Vs PAK Asia Cup 2022: Hardik Pandya Confident Reaction After Dot Ball In Final Over, Video Viral - Sakshi
Sakshi News home page

Asia Cup 2022: 'కూల్‌గా ఉండు కార్తీక్‌ భాయ్‌.. నేను ఫినిష్‌ చేస్తా'! వీడియో వైరల్‌

Aug 29 2022 8:08 AM | Updated on Dec 8 2022 12:41 PM

Hardik Pandyas reaction after playing a dot ball in the final over goes viral - Sakshi

ఆసియాకప్‌-2022లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన హై వోల్టేజ్‌ మ్యాచ్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠత పోరులో భారత ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి జట్టును గెలిపించాడు. ఆఖరి ఓవర్ లో భారత్ విజయానికి 7 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. నవాజ్‌ వేసిన తొలి బంతికే మంచి ఊపులో ఉన్న జడేజా క్లీన్‌ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది.

అనంతరం క్రీజులోకి వచ్చిన దినేష్‌ కార్తీక్‌ సింగల్‌ తీసి హార్దిక్‌ స్ట్రైక్‌ ఇచ్చాడు. అయితే మూడో బంతిని హార్దిక్ కవర్స్ లోకి ఆడగా.. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది. ఈ సమయంలో కార్తీక్‌ సింగిల్‌ కోసం ప్రయత్నించగా.. హార్దిక్‌ మాత్రం వద్దంటూ వారించాడు. "కూల్‌గా ఉండు కార్తీక్‌ భాయ్‌, నేను ఫినిష్‌ చేస్తా" అంటూ సైగలు చేశాడు. మాట నిలబెట్టుకున్న హార్దిక్‌ నాలుగో బంతికి భారీ సిక్సర్‌ బాది జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

కాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో హార్దిక్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టగా.. అనంతరం బ్యాటింగ్‌లో 33 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక భారత్‌ తమ రెండో మ్యాచ్‌లో బుధవారం(ఆగస్టు 31) హాంకాంగ్‌తో తలపడనుంది.

చదవండి: Asia Cup 2022: పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న భారత్‌.. ఉత్కంఠ పోరులో విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement