ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్, భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన మంచి మనసును చాటుకున్నాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలోని గ్రౌండ్ స్టాఫ్ ఒక్కొక్కరికి రూ.10,000 రూపాయల రివార్డును అందజేశాడు.
కాగా టీ20 ప్రపంచకప్-2026కు ముందు హార్దిక్ పాండ్యా వాంఖడే స్టేడియంలో తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలో గ్రౌండ్ స్టాఫ్ తమ పనివేళల కంటే అదనంగా శ్రమించి హార్దిక్ ప్రాక్టీస్‌కు సహకరించారు. దీంతో వారందరికీ నగదు బహుమతి ఇస్తానని పాండ్యా మాటిచ్చాడు.
ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం హార్దిక్ వారిని వ్యక్తిగతంగా కలిసి మొత్తం 11 మందికి చెక్కులను అందజేశాడు. అయితే తొలుత ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు ఇచ్చారని ప్రచారం జరిగినప్పటికీ, వాస్తవానికి అది రూ. 10,000 మాత్రమే అని తేలింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దీంతో గ్రౌండ్ స్టాప్ కష్టాన్ని గుర్తించింనందుకు పాండ్యాపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇక టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్.. ఇప్పుడు ఐపీఎల్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. ముంబై ఇండియన్స్ జట్టును పాండ్యా నడిపించనున్నాడు. ముంబై తమ తొలి మ్యాచ్‌లో మార్చి 29 వాంఖడే వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది.
చదవండి: టీమిండియాలోకి వైభవ్ సూర్యవంశీ.. ఆ సిరీస్‌తో ఎంట్రీ?


