ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం | Grandmaster Praggnanandhaa's Third Victory At The Norway Open International Chess Tournament, Gukesh Falls To Magnus Carlsen | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞానంద ఖాతాలో మరో విజయం

May 30 2026 9:35 AM | Updated on May 30 2026 12:39 PM

Grandmaster Praggnanandhaa's Third Victory At The Norway Open International Chess Tournament

ఓస్లో: నార్వే ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నీ పురుషుల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మూడో విజయం నమోదు చేశాడు. విన్సెంట్‌ కీమెర్‌తో జరిగిన నాలుగో రౌండ్‌లో ప్రజ్ఞానంద ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో గెలుపొందాడు. ఇద్దరి మధ్య జరిగిన క్లాసికల్‌ రెగ్యులర్‌ గేమ్‌ 46 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది.

టోర్నీ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించేందుకు ‘అర్మగెడాన్‌’ గేమ్‌ నిర్వహించారు. ప్రజ్ఞానంద 17 ఎత్తుల్లో కీమెర్‌ను ఓడించాడు. మరోవైపు క్లాసికల్‌ ఫార్మాట్‌లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ మరో ఓటమిని చవిచూశాడు. నార్వే దిగ్గజం మాగ్నస్‌ కార్ల్‌సన్‌ నల్ల పావులతో ఆడుతూ 42 ఎత్తుల్లో గుకేశ్‌ను ఓడించాడు. ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది.

ఇదే టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు దివ్య దేశ్‌ముఖ్, కోనేరు హంపి నాలుగో రౌండ్‌లో పరాజయం పాలయ్యారు. దివ్య–అనా ముజీచుక్‌ (ఉక్రెయిన్‌) మధ్య రెగ్యులర్‌ గేమ్‌ 63 ఎత్తుల్లో ‘డ్రా’ అయింది. ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో అనా ముజీచుక్‌ 39 ఎత్తుల్లో దివ్యను ఓడించింది. హంపి–జు జినెర్‌ (చైనా) రెగ్యులర్‌ గేమ్‌ 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ‘అర్మగెడాన్‌’ గేమ్‌లో జు జినెర్‌ 28 ఎత్తుల్లో హంపిపై గెలిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement