టోక్యో ఒలింపిక్స్‌.. నాలుగు కొత్త  క్రీడాంశాలు అరంగేట్రం

Four Sports To Make Debut In Tokyo Olympics - Sakshi

టోక్యో: విశ్వ క్రీడల్లో ఈసారి ఏకంగా నాలుగు కొత్త క్రీడాంశాలు అరంగేట్రం చేయనున్నాయి. స్కేట్‌ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్‌ క్లైంబింగ్, కరాటే క్రీడలకు తొలిసారి ఒలింపిక్స్‌లో చోటు లభించాయి. జపాన్‌లో అత్యంత ఆదరణ కలిగిన కరాటేకు ఈ క్రీడల్లో స్థానం ఇస్తున్నా... 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో మాత్రం కరాటేను కొనసాగించడంలేదు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌ తర్వాత బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్‌ క్రీడలు పునరాగమనం  చేయనున్నాయి.

బెరెటిని కూడా...ఒలింపిక్స్‌కు ఇటలీ టెన్నిస్‌ స్టార్‌ దూరం
రోమ్‌: విశ్వ క్రీడలకు దూరమవుతున్న టెన్నిస్‌ క్రీడాకారుల జాబితా ఇంకా పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో ఈ ఏడాది వింబుల్డన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ రన్నరప్, ఏడో ర్యాంకర్‌ మాటియో బెరెటిని కూడా చేరాడు. తొడ గాయం కారణంగా ఒలింపిక్స్‌కు దూరమవుతున్నానని... ఈ గాయం నుంచి కోలుకోవడానికి కనీసం రెండు వారాలు పడుతుందని బెరెటిని అన్నాడు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 20 గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్స్‌ చొప్పున నెగ్గిన రోజర్‌ ఫెడరర్‌ (స్విట్జర్లాండ్‌), రాఫెల్‌ నాదల్‌ (స్పెయిన్‌)... గత ఏడాది యూఎస్‌ ఓపెన్‌ చాంపియన్‌ డొమినిక్‌ థీమ్‌ (ఆస్ట్రియా), ఈ ఏడాది వింబుల్డన్‌ సెమీఫైనలిస్ట్, ప్రపంచ పదో ర్యాంకర్‌ డెనిస్‌ షపోవలోవ్‌ (కెనడా), మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల విజేత వావ్రింకా (స్విట్జర్లాండ్‌)... మహిళల సింగిల్స్‌లో గ్రాండ్‌స్లామ్‌ చాంపియన్స్‌ సెరెనా విలియమ్స్‌ (అమెరికా), సిమోనా హలెప్‌ (రొమేనియా), విక్టోరియా అజరెంకా (బెలారస్‌), ఎంజెలిక్‌ కెర్బర్‌ (జర్మనీ), బియాంక ఆండ్రెస్కూ (కెనడా) టోక్యో ఒలింపిక్స్‌ నుంచి వైదొలిగారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top