శుభవార్త చెప్పిన జహీర్‌ ఖాన్‌!

Former Indian Cricketer Jhaheer Khan Becoming Father - Sakshi

మాజీ ఇండియన్‌  క్రికెటర్‌ జహీర్‌ఖాన్‌ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. త్వరలోనే వారి ఇంట్లోకి మూడో మనిషి రాబోతున్నారు. జహీర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు. ప్రస్తుతం దుబాయ్‌లో ఐపీఎల్‌ జరుగుతుండగా జహీర్‌ఖాన్‌ ముంబై ఇండియన్స్‌ జట్టుకు డైరెక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ ఆపరేషన్స్‌(డీసీఏ)గా పనిచేస్తున్నారు. జహీర్‌ఖాన్‌ తన పుట్టినరోజు వేడు‍‍కలను కూడా ముంబై ఇండియన్స్‌ జట్టుతో కలసి దుబాయ్‌లోనే జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జహీర్‌ గురించి వర్ణించాలని ముంబై ఇండియన్స్‌ యాజమాన్యం కోరగా జహీర్‌ అందరితో సంప్రదించి వారి అభిప్రాయాలను సేకరించి నిర్ణయాలను తీసుకుంటాడని ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తెలిపారు. ఇక టీం ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా తాను తండ్రికాబోతున్నట్లు, వచ్చే ఏడాది జనవరిలో వారి ఇంటికి ఒక అతిధి రాబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.    

చదవండి: రషీద్‌ ఖాన్‌ భార్య అనుష్క శర్మ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top