FIFA WC 2022: భర్త వెళ్లిపోయినా.. భార్య మాత్రం ఖతర్‌లోనే

FIFA WC: Germany Footballer Wife-Stays Back Qatar To Support Brazil - Sakshi

ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో నాలుగుసార్లు ఛాంపియన్‌ అయిన జర్మనీ అనూహ్యంగా గ్రూప్‌ దశలోనే వెనుదిరిగింది. 2014లో ఛాంపియన్స్‌ అయిన జర్మనీ వరుసగా రెండోసారి గ్రూప్‌ దశలోనే వెళ్లిపోవడం సగటు అభిమానిని బాధించింది. అయితే ఓటమికి తోడూ దురదృష్టం కూడా తోడయ్యి జర్మనీని ఇంటిబాట పట్టించింది. కాగా జట్టు ఓటమితో గోల్‌కీపర్‌ కెవిన్‌ ట్రాప్స్‌ సొంత దేశానికి వెళ్లిపోయాడు.

అయితే అతని భార్య ఇజాబెల్ గౌలర్ట్ మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది. అదేంటి భర్త వెళ్లిపోయాడు.. భార్య వెళ్లకపోవడం ఏంటి అనేగా మీ డౌటు. నిజానికి ఇజాబెల్‌ గౌలర్ట్‌కు తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మనీ కంటే ఐదుసార్లు ఛాంపియన్‌ అయిన బ్రెజిల్‌ జట్టు అంటే ప్రాణం. అంతేకాదు ఇజాబెల్‌ బ్రెజిల్‌లోనే పుట్టి పెరిగింది. అందుకే తన స్వంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం భర్త వెళ్లిపోయినప్పటికి ఆమె మాత్రం ఖతర్‌లోనే ఉండిపోయింది.

ఇక ప్రీక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో బ్రెజిల్‌ తలపడగా.. మ్యాచ్‌కు ఇజాబెల్‌ గౌలర్ట్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రెజిల్‌ స్టార్‌ నెమ్‌మర్‌ జూనియర్‌ తండ్రి పక్కన కూర్చొని ఇజాబెల్‌ మ్యాచ్‌ను ఎంజాయ్‌ చేసింది. అనుకున్నట్లుగానే బ్రెజిల్‌ క్వార్టర్స్‌కు చేరడంతో ఆమె ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. భర్త అనుమతితోనే ఖతర్‌లో ఉండిపోయిన ఇజాబెల్‌ బ్రెజిల్‌ విజేతగా నిలిస్తే చూడాలని ఉందని పేర్కొంది.

అలా మొత్తానికి తన భర్త వెళ్లిపోయినా.. సొంత దేశానికి మద్దతు ఇవ్వడం కోసం ఇజాబెల్‌ ఖతర్‌లోనే ఉండిపోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక దక్షిణ కొరియాను 4-1తో మట్టికరిపించిన బ్రెజిల్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. నవంబర్‌ 9న జరగనున్న క్వార్టర్‌ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్‌ అమితుమీ తేల్చుకోనుంది.

చదవండి: గాయం సాకుతో బంగ్లా టూర్‌కు దూరం; భార్యను గెలిపించుకున్న జడేజా

ప్రాక్టీస్‌ సెషన్‌కు డుమ్మా.. అవమానం తట్టుకోలేకనేనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top