ష‌కీరా కూడా ప‌నికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట! | Fans Calling YouTuber IshowSpeed-FIFA WC-2026 Anthem Satisfied | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: ష‌కీరా కూడా ప‌నికిరాదు.. ఫ్యాన్స్‌ను షేక్‌చేస్తోన్న ఫిఫా పాట!

Jun 2 2026 3:06 PM | Updated on Jun 2 2026 3:46 PM

Fans Calling YouTuber IshowSpeed-FIFA WC-2026 Anthem Satisfied

ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌రో రెండు వారాల్లో ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ సంద‌డి మొద‌లుకానుంది. జూన్ 11 నుంచి జ‌ర‌గ‌నున్న ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు అమెరికా, మెక్సికో, కెనడాలు సంయుక్తంగా ఆతిథ్య‌మిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఫిఫా ప్రపంచకప్‌ను ప్రమోట్ చేస్తూ ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ ఐషోస్పీడ్ త‌న‌ ప్ర‌త్యేక గీతాన్ని విడుదల చేశాడు. 

అయితే ఐషోస్పీడ్ పాడిన పాట 24 గంట‌ల్లోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఒక్క ఇన్‌స్టాగ్రామ్‌లోనే 40 మిలియ‌న్ల వ్యూస్ సాధించ‌డం విశేషం. ఇక యూట్యూబ్‌లోనూ మూడు మిలియన్లు, ఇతర ప్లాట్‌ఫామ్స్‌ కలిపి మరో ఏడు మిలియన్ల వ్యూస్‌ సాధించింది. ఈ లెక్క‌న ఒక్క‌రోజులోనే 50 మిలియ‌న్ల వ్యూస్ సాధించడం మ‌రో రికార్డుగా నిలిచింది. 

అయితే మే నెల‌లో కొలంబియ‌న్ పాప్‌స్టార్ ష‌కీరా, నైజీరియ‌న్ ఆఫ్రోబీట్స్ ఐకాన్ బ‌ర్నాబాయ్‌ల‌తో ఫిఫా నిర్వాహ‌కులు ప్ర‌పంచ‌క‌ప్ అధికారిక గీతాన్ని విడుద‌ల చేశారు. టోర్నమెంట్ బహుళ సాంస్కృతిక స్ఫూర్తిని చాటిచెప్పేలా, విలక్షణమైన పశ్చిమ ఆఫ్రికా లయలను ఉత్సాహభ రితమైన లాటిన్ బీట్స్‌తో మేళవించేలా "డై డై" అనే ఈ ట్రాక్‌ను రూపొందించారు. కానీ ఫిఫా నిర్వాహ‌కులు విడుద‌ల చేసిన గీతం జ‌నాల‌కు అంతగా ఎక్క‌లేదు. 

చారిత్రాత్మ‌క ఫుట్‌బాల్ గీతాల్లో సాధార‌ణంగా ఉండే స‌హ‌జ‌మైన‌, ఉత్సాహ‌భ‌రిత‌మైన ట్యూన్స్ మిస్స‌య్యాయ‌ని చాలా మంది అభిమానులు విమ‌ర్శించారు. కానీ ఇదే స‌మ‌యంలో ఐషో స్పీడ్ విడుద‌ల చేసిన గీతం మాత్రం అభిమానుల‌ను పిచ్చెక్కిస్తోంది. ఐషో స్పీడ్ పాడిన పాట అన్ని దేశాల సంప్ర‌దాయాల‌ను మేళ‌విస్తూ పాడడంతో 24 గంట‌ల్లోనే వైరల‌య్యి కూర్చొంది. 'ఫిఫా విడుద‌ల చేసిన దానికంటే ఐషో స్పీడ్ పాడిన పాట మంచి కిక్ ఇస్తుంద‌ని.. ఇది క‌దా అస‌లైన ఫిఫా పాట" అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక జూన్ 11 నుంచి మొద‌లుకానున్న ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌లు భార‌త్‌లో కూడా ప్ర‌సారం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ టోర్నీకి సంబంధించిన ప్ర‌సార హ‌క్కుల‌ను జీ నెట్‌వ‌ర్క్ మంచి ధ‌ర‌కు కొనుగోలు చేసింది. 2010 ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ స‌మ‌యంలో ష‌కీరా పాడిన వాకా వాకా పాట ఎంత ప్ర‌సిద్ధి చెందిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఐషో స్పీడ్ పాడిన పాట ష‌కీరా పాట‌ను కూడా క్రాస్ చేసేలా క‌నిపిస్తోంది.

చదవండి: వైభవ్‌ కోసం పడిగాపులు.. అస్సలు తగ్గేదేలే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement