
హార్దిక్ పాండ్యాకు స్వీట్ షాక్ (PC: X)
ఐపీఎల్-2024 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ప్రయాణం మొదలుపెట్టిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు అడుగడుగునా అవమానమే ఎదురైంది. గుజరాత్ టైటాన్స్‌ను వీడినందుకు అటు అక్కడి ఫ్యాన్స్.. ఇటు రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ అయినందుకు ముంబై అభిమానులు పాండ్యాను పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు.
ముఖ్యంగా ముంబై ఆరంభ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్‌తో.. అది కూడా అహ్మదాబాద్‌లో జరగడం.. అందులో ముంబై ఓడిపోవడంతో పాండ్యాపై కామెంట్లు శ్రుతిమించాయి. మ్యాచ్ జరుగుతున్నపుడు కుక్క మైదానంలోకి రాగా హార్దిక్ హార్దిక్ అంటూ టైటాన్స్ ఫ్యాన్స్ అరిచారు. ఓటమితో వెనుదిరిగినపుడు అభ్యంతరకర భాషతో అతడిని తిట్టిపోశారు.
ఈ క్రమంలో ముంబై- గుజరాత్ మ్యాచ్ తర్వాత నెట్టింట ఎక్కడ చూసినా హార్దిక్ పాండ్యాను విమర్శిస్తూ.. హేళన చేసిన పోస్టులో దర్శనమిచ్చాయి. అంతేకాదు అతడి కెప్టెన్సీని విశ్లేషిస్తూ ఇలాంటి తప్పులే జట్టును ఓటమిపాలు చేశాయంటూ మాజీ క్రికెటర్లు సైతం విమర్శలు చేశారు.
ఈ పరిణామాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు సంబంధించిన పోస్టు అతడి అభిమానుల హృదయాలను గెలుచుకుంది. దుర్గేశ్ తివారి అనే ఎక్స్ యూజర్.. ‘‘ఈరోజు హైదరాబాద్‌లో నా ఐడల్ హార్దిక్ పాండ్యాను కలిశాను’’ అంటూ ఓ వీడియో షేర్ చేశాడు. ఇందులో అతడు పాండ్యా పాదాలకు నమస్కరించగా.. అనంతరం అతడిని హత్తుకుని ఫొటోలకు ఫోజులిచ్చాడీ కెప్టెన్ సాబ్.
ఇది చూసిన పాండ్యా ఫ్యాన్స్.. ‘‘నువ్వు చాలా లక్కీ.. మాకెప్పుడు ఆ ఛాన్స్ వస్తుందో!’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, మరికొంత మంది మాత్రం మరోసారి పాండ్యాను విమర్శిస్తూ ట్రోల్ చేయడం గమనార్హం.
కాగా ఐపీఎల్-2024లో భాగంగా తమ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఇందుకోసం పాండ్యా హైదరాబాద్‌కు రాగా.. ఇలా తన అభిమాని ఎదురొచ్చాడు. రోహిత్ శర్మ ‘ఇలాకా’గా చెప్పుకొనే హైదరాబాద్‌లో పాండ్యా.. తనకు ఇలాంటి అనుభవం ఎదురవుతుందని అస్సలు ఊహించి ఉండడు!
చదవండి: #CSKvsGT: శుబ్‌మన్ గిల్‌కు భారీ జరిమానా.. కారణం ఇదే
Met my idol in Hyderabad 🥹🥹.
— Durgesh Tewary (@ChatGPTChr26111) March 26, 2024
Thank you Idolo @hardikpandya7.#IPL2024live#HardikPandya pic.twitter.com/fNVHjiY5nY