రూట్‌ ఒక్కడు ఒకవైపు.. టీమిండియా అంతా ఒకవైపు..! | India Vs England 3rd Test: Indian Cricket Team Line Up Poor For The Third Test Against England In Rajkot - Sakshi
Sakshi News home page

IND VS ENG 3rd Test: టీమిండియా బ్యాటింగ్‌లో లైనప్‌లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న అనుభవలేమి

Feb 12 2024 9:02 PM | Updated on Feb 12 2024 9:17 PM

In Experience Indian Batting Lineup Creating Tension Before 3rd Test Vs England - Sakshi

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు ముందు టీమిండియాను ఓ అంశం తీవ్ర కలవరానికి గురి చేస్తుంది. వివిధ కారణంగా చేత సీనియర్‌ బ్యాటర్లు ఒక్కొక్కరుగా వైదొలగడంతో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌లో అనుభవలేమి కొట్టొచినట్లు కనిపిస్తుంది. వ్యక్తిగత కారణాల చేత 100కు పైగా టెస్ట్‌లు ఆడిన విరాట్‌ కోహ్లి, ఫిట్‌నెస్‌ సమస్య కారణంగా కేఎల్‌ రాహుల్‌, గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ మూడో టెస్ట్‌కు దూరమయ్యారు. ఈ ముగ్గురు స్టార్‌ బ్యాటర్లు దూరం కావడంతో భారత బ్యాటింగ్‌ లైనప్‌ గతంలో ఎన్నడూ లేనంత ఢీలాగా కనిపిస్తుంది.

ఇక్కడ ఓ ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ ఒక్కడు ఆడినన్ని టెస్ట్‌లు టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ అంతా కలిపి కూడా ఆడలేదు. రూట్‌ ఇప్పటివరకు 137 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడగా.. భారత బ్యాటర్లంతా కలిపి అతను ఆడిన మ్యాచ్‌ల్లో 75 శాతం కూడా ఆడలేదు. భారత బ్యాటింగ్‌ లైనప్‌ అంతా కలిపి ఇప్పటివరకు కేవలం 92 టెస్ట్‌లు మాత్రమే ఆడారు. 

ఇందులో కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు మాత్రమే కనీసం 50 టెస్ట్‌లు ఆడిన అనుభవం​ ఉంది. రోహిత్‌ తర్వాత శుభ్‌మన్‌ గిల్‌ అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడాడు. జట్టులో నెక్స్‌ సీనియర్‌ కేఎస్‌ భరత్‌. అతడికి ఏడు మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఉంది. ఆతర్వాత యశిస్వి జైస్వాల్‌ 6, రజత్‌ పాటిదార్‌ ఒక్క టెస్ట్‌ మ్యాచ్‌ ఆడారు.

దృవ్‌ జురెల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, రాహుల్‌ స్థానంలో ఎంపికైన రజత్‌ పాటిదార్‌ ఇంకా  అరంగేట్రం చేయాల్సి ఉంది. రవీంద్ర జడేజా 69, అశ్విన్‌ 97 టెస్ట్‌లు ఆడినప్పటికీ వీరిద్దరిని స్పెషలిస్ట్‌ బ్యాటర్లుగా పరిగణిలేము. ఈ పరిస్థితుల్లో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఎలా నెట్టుకొస్తుందో వేచి చూడాలి. భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభంకానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచ్‌ గెలిచి సమంగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement