ఘన విజయంతో ఇంగ్లండ్‌ ఇంటికి | England win over Pakistan by 93 runs | Sakshi
Sakshi News home page

ఘన విజయంతో ఇంగ్లండ్‌ ఇంటికి

Nov 12 2023 2:38 AM | Updated on Nov 12 2023 2:38 AM

England win over Pakistan by 93 runs - Sakshi

కోల్‌కతా: డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈ వరల్డ్‌ కప్‌లో అడుగు పెట్టిన ఇంగ్లండ్‌ టోర్నీలో చెత్త ప్రదర్శనతో విమర్శలపాలైంది. వరుస ఓటముులతో ఎప్పుడో సెమీస్‌ అవకాశాలు కోల్పోయిన ఆ జట్టు చివరకు విజయంతో టోర్నీని ముగించి ఇంటిముఖం పట్టింది. శనివారం ఈడెన్‌ గార్డెన్స్‌లో పాకిస్తాన్‌తో జరిగిన ఆఖరి లీగ్‌లో ఇంగ్లండ్‌ 93 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోరు చేసింది.

బెన్‌ స్టోక్స్‌ (76 బంతుల్లో 84; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), జో రూట్‌ (72 బంతుల్లో 60; 4 ఫోర్లు), బెయిర్‌ స్టో (61 బంతుల్లో 59; 7 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీలతో రాణించారు. టాస్‌ గెలిచి ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ ఎంచుకోవడంతోనే పాకిస్తాన్‌ సెమీస్‌ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. అయితే ‘నామ్‌కే వాస్తే’ తరహాలో లక్ష్యాన్ని లెక్క కట్టి చూస్తే... సెమీస్‌కు అర్హత సాధించాలంటే 6.4 ఓవర్లలో 338 పరుగులు చేయాలి. ఇది అసాధ్యం కావడంతో పాక్‌ ఊరట విజయంపై దృష్టి పెట్టింది.

కానీ భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌ 43.3 ఓవర్లలో 244 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆగా సల్మాన్‌ (45 బంతుల్లో 51; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ సాధించగా, కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ (45 బంతుల్లో 38; 6 ఫోర్లు), రిజ్వాన్‌ (51 బంతుల్లో 36; 2 ఫోర్లు) కాస్త మెరుగ్గా ఆడారు. 191 పరుగులకే 9 వికెట్లు కోల్పోగా 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రవూఫ్‌ (23 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరిపించాడు.

వన్డే కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన డేవిడ్‌ విల్లీ 3 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.  వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్‌ 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. 

స్కోరు వివరాలు 
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: మలాన్‌ (సి) రిజ్వాన్‌ (బి) ఇఫ్తికార్‌ 31; బెయిర్‌స్టో (సి) సల్మాన్‌ (బి) రవూఫ్‌ 59; రూట్‌ (సి) షాదాబ్‌ (బి) షాహిన్‌ 60; స్టోక్స్‌ (బి) షాహిన్‌ 84; బట్లర్‌ రనౌట్‌ 27; బ్రూక్‌ (సి) షాహిన్‌  (బి) రవూఫ్‌ 30; అలీ (బి) రవూఫ్‌ 8; వోక్స్‌ నాటౌట్‌ 4; విల్లీ (సి) ఇఫ్తికార్‌ (బి) వసీమ్‌ 15; అట్కిన్సన్‌ (బి) వసీమ్‌ 0; రషీద్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–82, 2–108, 3–240, 4–257, 5–302, 6–308, 7–317, 8–336, 9–336. బౌలింగ్‌: షాహిన్‌  10–1–72–2, రవూఫ్‌ 10–0–64–3, ఇఫ్తికార్‌ 7–0–38–1, వసీమ్‌ 10–0–74–2, షాదాబ్‌ 10–0–57–0, సల్మాన్‌ 3–0–25–0.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: షఫీక్‌ (ఎల్బీ) (బి) విల్లీ 0; ఫఖర్‌ (సి) స్టోక్స్‌ (బి) విల్లీ 1; బాబర్‌ (సి) రషీద్‌ (బి) అట్కిన్సన్‌ 38; రిజ్వాన్‌ (బి) అలీ 36; షకీల్‌ (బి) రషీద్‌ 29; సల్మాన్‌ (సి) స్టోక్స్‌ (బి) విల్లీ 51; ఇఫ్తికార్‌ (సి) మలాన్‌ (బి) అలీ 3; షాదాబ్‌ (బి) రషీద్‌ 4; షాహిన్‌ (ఎల్బీ) (బి) అట్కిన్సన్‌ 25; వసీమ్‌ నాటౌట్‌ 16; రవూఫ్‌ (సి) స్టోక్స్‌ (బి) వోక్స్‌ 35; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (43.3 ఓవర్లలో ఆలౌట్‌) 244. వికెట్ల పతనం: 1–0, 2–10, 3–61, 4–100, 5–126, 6–145, 7–150, 8–186, 9–191, 10–244. బౌలింగ్‌: విల్లీ 10–0–56–3, వోక్స్‌ 5.3–0–27–1, రషీద్‌ 10–0–55–2, అట్కిన్సన్‌ 8–0–45–2, అలీ 10–0–60–2.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement