ILT20: Dominic Drakes rushed to hospital after suffering facial blow - Sakshi
Sakshi News home page

ILT20: తీవ్రంగా గాయపడ్డ వెస్టిండీస్‌ క్రికెటర్‌.. స్ట్రెచర్‌పై మైదానం బయటకు!

Feb 7 2023 11:11 AM | Updated on Feb 7 2023 11:53 AM

Dominic Drakes rushed to hospital after suffering facial blow - Sakshi

ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో భాగంగా సోమవారం జరిగిన షార్జా వారియర్స్, గల్ఫ్ జెయింట్స్ సందర్భంగా ఓ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌లో గల్ఫ్ జెయింట్స్ ఆటగాడు, వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ తీవ్రంగా గాయపడ్డాడు.

ఏం జరిగిందంటే?
వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్ డ్రేక్స్ ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌లో గల్ఫ్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో షార్జా వారియర్స్ ఇన్నింగ్స్‌ ఆరో ఓవర్‌ వేసిన బ్రాత్‌వైట్ బౌలింగ్‌లో.. మోయిన్‌ అలీ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. అది మిస్‌టైమ్‌ అయ్యి గాల్లోకి లేచింది.

అయితే బౌండర్‌ లైన్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న డ్రేక్‌ పరిగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో అతడి ముఖం నేలకు బలంగా తాకింది. దీంతో వెంటనే అతడు తీవ్రమైన నొప్పితో విలవిల్లాడు.

ఈ క్రమంలో మెడికల్‌ సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై మైదానం బయటకు తీసుకువెళ్లారు. అయితే అతడిని హూటాహూటిన ఆస్పత్రికి తరిలించారు. ఇక ముఖంకు తీవ్రమైన గాయమైనప్పటికీ అద్భుతమైన ‍క్యాచ్‌ను అందుకున్న అతడిపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

7 వికెట్ల తేడాతో గల్ఫ్ జెయింట్స్ విజయం
ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.షార్జా వారియర్స్‌ పై గల్ఫ్ జెయింట్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన షార్జా 107 పరుగులకే కుప్పకూలింది. గల్ఫ్ జెయింట్స్ బౌలర్లలో డేవిడ్‌ వైస్ ఐదు వికెట్లతో  షార్జా వెన్ను విరచగా.. బ్రాత్‌వైట్ రెండు, సంచిత్‌ శర్మ,హెల్మ్‌ తలా వికెట్‌ సాధించారు. అనంతరం 108 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన  జెయింట్స్ మూడు వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: Nepal Head Coach: నేపాల్‌ జట్టు హెడ్‌ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement