Disqualified Ukraine Fencer Says We'll Never Shake Hands With Russian - Sakshi
Sakshi News home page

Fencing World Championships: ప్రత్యర్ధికి షేక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు నిరాకరణ.. ఏకంగా టోర్నీ నుంచి ఔట్‌!

Jul 28 2023 12:28 PM | Updated on Jul 28 2023 1:00 PM

Disqualified Ukraine fencer says  well never shake hands with Russians - Sakshi

మిలాన్‌ వేదికగా జరుగుతున్న వరల్డ్‌ ఫెన్సింగ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఉక్రేనియన్ ఫెన్సర్ ఓల్గా ఖర్లాన్ అనర్హత వేటు పడింది. ప్రత్యర్ది రష్యన్‌ ఫెన్సర్స్‌ అన్నా స్మిర్నోవాతో కరచాలనం చేసేందుకు నిరాకరించడంతో ఆమెను ఈ ఛాంపియన్‌షిప్స్‌ నుంచి తప్పించారు. గరువారం జరిగిన మ్యాచ్‌లో స్మిర్నోవాపై  15-7 తేడాతో ఖర్లాన్ విజయం సాధించింది. అయితే మ్యాచ్‌ పూర్తి అయిన తర్వాత స్మిర్నోవా.. ఓల్గాకు షెక్‌హ్యాండ్‌ ఇచ్చేందుకు  ఆసక్తి చూపింది.

కానీ ఓల్గా ఖర్లాన్ మాత్రం అందుకు విముఖత చూపింది. కాగా గతేడాది ఫిభ్రవరి నుంచి రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్ధితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన దేశానికి మద్దతుగా షెక్‌ హ్యాండ్‌ ఇచ్చేందుకు ఓల్గా నిరకారించింది. " మాపై ఎటువంటి  చర్యలు తీసుకున్న పర్వాలేదు. మేము ఎప్పటికి వారితో(రష్యా) చేతులు కలపము" అంటూ తనపై వేటు పడిన అనంతరం ఓల్గా  వాఖ్యనించింది.
చదవండి: IND vs WI: కోహ్లి సింగిల్‌ హ్యాండ్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. నోరెళ్లబెట్టిన గిల్! వీడియో వైరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement