Dinesh Karthik Special Batting Lesson To Rishabh Pant Ahead Warm Up Match, Video Viral - Sakshi
Sakshi News home page

T20 WC 2022: పంత్‌కు దినేశ్‌ కార్తిక్‌ పాఠాలు.. వీడియో వైరల్‌

Oct 17 2022 11:09 AM | Updated on Oct 17 2022 12:25 PM

Dinesh Karthik Special Batting Lesson Rishabh Pant Before AUS Match - Sakshi

టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌కు ముందు పంత్‌, కార్తిక్‌ల మధ్య సంభాషణ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 ప్రపంచకప్‌కు ఫినిషర్‌ పాత్రలో ఎంపికైన కార్తిక్‌ వద్ద పంత్‌ ఏం సలహాలు తీసుకున్నాడనేది ఆసక్తికరంగా మారింది. బహుశా పంత్‌కు కార్తిక్‌ బ్యాటింగ్‌ పాఠాలు బోధించి ఉంటాడని క్రికెట్‌ ఫ్యాన్స్‌ అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలో పంత్‌, కార్తిక్‌లు చాలాసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పంత్‌, కార్తిక్‌లు విడివిడిగా బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు.

కాగా వెస్ట్రన్‌ ఆస్ట్రేలియాతో రెండు ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో గెలిచి.. మరొకటి ఓడింది. తొలి రెండు మ్యాచ్‌లో పెర్త్‌లో జరగ్గా.. తాజాగా డిపెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియాతో వార్మప్‌ మ్యాచ్‌ గబ్బాలో జరుగుతుంది. ఈ మ్యాచ్‌ గెలిచి.. పాక్‌తో పోరుకు ముందు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలని టీమిండియా భావిస్తోంది. టాస్‌ ఓడి ‍బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 57, సూర్యకుమార్‌ యాదవ్‌ 50, దినేశ్‌ కార్తిక్‌ 20 పరుగులు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement