కోల్‌కతా: ఆసియా క్రీడలు, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో పతకాలే లక్ష్యంగా... భారత కాంపౌండ్ ఆర్చరీ జట్టుకు కొత్త విదేశీ కోచ్‌ను నియమించారు. అమెరికాకు చెందిన 49 ఏళ్ల డేవ్ కజిన్స్ భారత కాంపౌండ్ ఆర్చర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. డేవ్ కజిన్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదుసార్లు స్వర్ణ పతకాలు సాధించారు.
2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో తొలిసారి కాంపౌండ్ విభాగాన్ని (మిక్స్‌డ్ మాత్రమే) మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. మరో రెండు వారాల్లో భారత జట్టుతో చేరనున్న కజిన్స్‌కు నెల వేతనంగా 12,000 డాలర్లు (రూ. 11 లక్షల 53 వేలు) ఇస్తారని సమాచారం.


