'మాకోసం ఆ మైదానాలు చిన్నగా మార్చండి' | CSK Requests IPL Governing Council Reduce Boundary Size | Sakshi
Sakshi News home page

మాకోసం ఆ మైదానాలు చిన్నగా మార్చండి : సీఎస్‌కే

Oct 10 2020 4:56 PM | Updated on Oct 10 2020 5:49 PM

CSK Requests IPL Governing Council Reduce Boundary Size - Sakshi

దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు నిరాశజనకమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో​ కేవలం రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం దిశగా సాగిన చెన్నై ఒక్కసారిగా తడబడి అనూహ్యంగా ఓటమిపాలైంది. ధోని, కేదార్‌ జాదవ్‌ ఆటతీరును చాలా మంది విమర్శించారు. అయితే చెన్నై తాను ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఆరు సార్లు చేజింగ్‌కే పరిమితమైంది. కాగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు యూఏఈ వేదికగా షార్జా, దుబాయ్‌, అబుదాబి వేదికగా జరుగుతున్న సంగతి తెలిసిందే. (చదవండి : పంజాబ్‌ బ్యాటింగ్‌ వర్సెస్‌ వరుణ్‌)

ఈ నేపథ్యంలో సీఎస్‌కే మేనేజ్‌మెంట్ శుక్రవారం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కలిసినట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్‌, అబుదాబి స్టేడియాల‍్లో ఉన్న బౌండరీలైన్‌ను తగ్గించాలంటూ కౌన్సిల్‌ను కోరినట్లు తెలిసింది. మా జట్టులో సీనియర్‌ ఆటగాళ్లు ఎక్కువగా ఉండడం.. పైగా దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉండడం వల్ల సీనియర్‌ ఆటగాళ్లు ఒత్తిడికి తట్టుకోలేకపోతున్నారని సీఎస్‌కే తెలిపింది. అంతేగాక మా జట్టు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో చేజింగ్‌ చేయాల్సి రావడం.. మొదట  ఫీల్డింగ్‌లో అలిసిపోవడంతో మా ఆటగాళ్లు చేదనలో ఎనర్జీతో కనిపించడం లేదన్నారు. అందుకే తాము ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కలిసి దుబాయ్‌, అబుదాబి మైదానాల్లోని బౌండరీ లైన్‌ను తగ్గించాలని కోరినట్లు తెలిపారు. చెన్నై జట్టు చేసిన ప్రతిపాదనను రాజస్తాన్‌ జట్టు కూడా స్పందిస్తూ ఈ విషయంలో తమ మద్దతు కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపినట్లు సమాచారం.(చదవండి : ఇంత పొడవైన క్రికెటర్‌ను ఎప్పుడైనా చూశారా)

వాస్తవం : చెన్నై యాజమాన్యం ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ను కలిసినట్లుగా వచ్చిన వార్తలో నిజం లేదు. ఇది కేవలం ఉహాగానాలు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement