UEFA టైటిల్‌ గెలిచిన పోర్చుగల్‌.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో | Video: Cristiano Ronaldo Wins UEFA Nations Trophy For Portugal, Gets Emotional As Virat Kohli After Winning IPL 2025 | Sakshi
Sakshi News home page

UEFA టైటిల్‌ గెలిచిన పోర్చుగల్‌.. కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన క్రిస్టియానో రొనాల్డో

Jun 9 2025 7:08 AM | Updated on Jun 9 2025 9:38 AM

Cristiano Ronaldo Wins UEFA Nations Trophy For Portugal, Gets Emotional As Virat Kohli After Winning IPL 2025

పోర్చుగల్‌ దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో తన దేశానికి రెండో UEFA నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ను అందించాడు. జర్మనీలోని మ్యూనిచ్‌ వేదికగా ఆదివారం​ (జూన్‌ 8) జరిగిన ఫైనల్లో పోర్చుగల్‌ పెనాల్టీ షూటౌట్‌లో స్పెయిన్‌పై 5-3 గోల్స్‌తో నెగ్గి టైటిల్‌ను కైవసం చేసుకుంది. షూటౌట్‌కు ముందు ఇరు జట్లు 2-2 గోల్స్‌తో సమంగా నిలిచాయి. 

ఎక్స్‌ట్రా టైమ్‌లో కూడా ఫలితం రాకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ అనివార్యమైంది. ఈ మ్యాచ్‌లో రొనాల్డో ఓ గోల్‌ చేశాడు. ఇది అతని కెరీర్‌లో 138 గోల్‌. నిర్ణీత సమయంలో తొలుత స్పెయిన్‌కు చెందిన మైఖేల్‌ ఒయార్‌జబాల్‌ గోల్‌ చేయగా.. రొనాల్డో తన గోల్‌తో స్కోర్‌ సమం చేశాడు. అనంతరం స్పెయిన్‌కు చెందిన మార్టిన్‌ జుబిమెండి రెండో గోల్‌ చేయగా.. పోర్చుగల్‌ తరఫున నునో మెండెస్‌ గోల్‌ చేసి స్కోర్‌ సమం చేశాడు.

  • మరోవైపు మూడో స్థానం కోసం జరిగిన పోటీలో కైలియన్‌ ఎంబపే నేతృత్వంలోని ఫ్రాన్స్‌ ఆతిథ్య దేశం జర్మనీపై 2-0 గోల్స్‌ తేడాతో నెగ్గింది.

కోహ్లి తరహాలో భావోద్వేగానికి లోనైన రొనాల్డో
ఆర్సీబీ ఈ యేడు ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచాక ఆ జట్టు స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఏ రకంగా భావోద్వేగానికి లోనయ్యాడో, క్రిస్టియానో రొనాల్డో కూడా తన రెండో UEFA నేషన్స్‌ లీగ్‌ టైటిల్‌ గెలిచాక అదే తరహాలో ఎమోషనల్‌ అయ్యాడు. కోహ్లి, రొనాల్డో కంపారిజన్‌ ఇమేజ్‌లు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి. 

క్రికెట్‌ అభిమానులు కోహ్లి, రొనాల్డోను కీర్తిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అంటూ ఆకాశానికెత్తుతున్నారు. కోహ్లి, రొనాల్డో లేటు వయసులోనూ అత్యుత్తమ ఫిట్‌నెస్‌ను కలిగి తమతమ క్రీడా విభాగాల్లో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.  

 

 

Advertisement
 
Advertisement
Advertisement