క్రికెట్‌ కోచ్‌కు బెయిల్‌ నిరాకరణ | Court refuses bail to local cricket coach in minor girl sexual assault case | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి కేసు.. క్రికెట్‌ కోచ్‌కు బెయిల్‌ నిరాకరణ

Apr 10 2026 6:39 PM | Updated on Apr 10 2026 6:39 PM

Court refuses bail to local cricket coach in minor girl sexual assault case

ముంబైలోని ఓ స్థానిక క్రికెట్ కోచ్ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో నిందితుడు గత 8 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. తాజాగా నిందితుడి తరఫు న్యాయవాది బెయిల్‌కు అప్పీల్‌ చేయగా.. ప్రత్యేక POCSO కోర్టు నిరాకరించింది.

న్యాయమూర్తి సురేఖా సిన్హా మాట్లాడుతూ.. ఇలాంటి పరిస్థితుల్లో బెయిల్‌ ఇస్తే, మైనర్‌ బాలికలపై మళ్లీ నేరం జరిగే ప్రమాదం ఉంది. నిందితుడు పరారయ్యే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు. 2023లో మరో మైనర్‌ బాలిక కూడా ఇదే కోచ్‌పై అనుచిత ప్రవర్తన ఆరోపణలు చేసినట్టు ప్రాసిక్యూషన్‌ గుర్తు చేసింది.  

కేసు వివరాల్లోకి వెళితే.. కోచ్‌ తనపై పలు మార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత మైనర్‌ బాలిక ఆరోపించింది. వైద్య ఆధారాలు, వెంటనే నమోదు చేసిన FIR ఈ కేసుకు బలమైన సాక్ష్యాలుగా నిలిచాయి. కోచ్‌ CCTV కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు తొలగించాడని ప్రాసిక్యూషన్‌ వాదించింది.  

తప్పుడు ఫిర్యాదు
నిందితుడి తరఫు న్యాయవాది బాలిక తప్పుడు ఫిర్యాదు చేసిందని వాదించారు. కోచ్‌ 2025 ఆగస్టు 5 నుంచి 8 నెలలుగా కస్టడీలో ఉన్నాడని, కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. నిందితుడి తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకోని కోర్టు.. నేరం తీవ్రతను హైలైట్‌ చేస్తూ బెయిల్‌ నిరాకరించింది. ఈ పరిస్థితుల్లో బెయిల్‌ ఇవ్వడం సరైంది కాదని తీర్పులో పేర్కొంది.  

Advertisement
 
Advertisement
Advertisement