
వెల్లింగ్టన్ వేదికగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు రసవత్తరంగా మొదలైంది. మొదటి రోజు ఆటలో కివీస్ బౌలర్లు ఆధిపత్యం చెలాయించినప్పటికి.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ మాత్రం అద్బుత సెంచరీతో అడ్డుగా నిలిచాడు. మొదటి రోజు ఆటముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది.
కివీస్ పేసర్ మాట్ హెన్రీ ఆసీస్‌ను 4 వికెట్లతో దెబ్బతీశాడు. అతడితో పాటు విలియం ఒరోర్కే, కుగ్గిలిజన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ ఆసీస్‌ను గ్రీన్ అదుకున్నాడు. 155 బంతుల్లో 16 ఫోర్లు సాయంతో 103 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. గ్రీన్‌తో పాటు మిచెల్ మార్ష్(40) పరుగులతో రాణించాడు.
చదవండి: #Shreyas Iyer: అదేనా అయ్యర్ చేసిన తప్పు? శ్రేయస్ మళ్లీ ఎంట్రీ ఇస్తాడా?