
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ గాయం కారణంగా భారత్‌తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ విషయాన్నిక్రికెట్ ఆస్ట్రేలియా అధికారికంగా ధ్రువీకరించింది.
కాగా గ్రీన్ ప్రస్తుతం వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవలే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో గ్రీన్ గాయపడ్డాడు. అయితే అతడి గాయం తీవ్రం కావడంతో శస్త్రచికిత్స అవసరమని వైద్యలు సూచించారు. దీంతో గ్రీన్ శస్త్రచికిత్స కోసం న్యూజిలాండ్‌కు వెళ్లనున్నాడు.
సర్జరీ అనంతరం అతడు కనీసం 6 నెలల పాటు ఆటకు దూరంగా ఉండనున్నాడు. ఈ క్రమంలో కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, శ్రీలంక పర్యటన, ఛాంపియన్స్ ట్రోఫీలకు గ్రీన్ దూరం ఉన్నాడు. అతడు తిరిగి ఐపీఎల్ సమయానికి కోలుకునే అవకాశముంది.
"గ్రీన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌లో చిన్న పగులు ఉన్నట్లు తేలింది. మా వైద్య బృందంతో సంప్రదింపులు జరిపిన తర్వాత కామెరాన్ శస్త్రచికిత్స చేసుకోవడానికి సిద్దమయ్యాడు. అతడు తిరిగి మళ్లీ వీలైనంత త్వరగా మైదానంలో అడుగుపెట్టాలని కోరుకుంటున్నాము" అని ఓ ప్రకటనలో క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.
కాగాప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు నిజంగా ఇది గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక నవంబరు 22- జనవరి 7 వరకు భారత్-ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది.
చదవండి: Asia Cup 2024:భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా తిలక్ వర్మ