
ఫుకెట్ (థాయ్‌లాండ్): ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్ రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ధీరజ్, సుశాంత్ పార్థ్ సాలుంకె, రాహుల్ కుమార్ నగర్వాల్‌లతో కూడిన భారత జట్టు 6–2తో కజకిస్తాన్ జట్టును ఓడించింది.