breaking news
Archery ranking championship
-
ధీరజ్ జట్టు పసిడి గురి
ఫుకెట్ (థాయ్‌లాండ్): ఆసియా కప్ వరల్డ్ ర్యాంకింగ్ స్టేజ్–1 ఆర్చరీ టోర్నమెంట్లో భారత్‌కు ప్రాతి నిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ పురుషుల టీమ్ రికర్వ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో ధీరజ్, సుశాంత్ పార్థ్ సాలుంకె, రాహుల్ కుమార్ నగర్వాల్లతో కూడిన భారత జట్టు 6–2తో కజకిస్తాన్ జట్టును ఓడించింది. -
ప్రిక్వార్టర్స్‌లో దీపిక
జాతీయ సీనియర్ ర్యాంకింగ్ ఆర్చరీ సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ ఆర్చరీ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో అగ్రశ్రేణి ఆర్చర్లంతా ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. గచ్చిబౌలి అథ్లెటిక్స్ స్టేడియంలో శనివారం రికర్వ్ ఈవెంట్లో క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. పురుషుల, మహిళల విభాగాల్లో 16 మంది చొప్పున ఆర్చర్లు ముందంజ వేశారు. మహిళల విభాగంలో లక్ష్మీరాణి మాఝి (ఆర్ఎస్పీబీ) మొత్తం 648 పాయింట్లు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి (జార్ఖండ్) 645 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. బొంబేలా దేవి (ఆర్ఎస్పీబీ-640)కి మూడో స్థానం దక్కింది. 585 పాయింట్లు సాధించి 13వ స్థానంలో నిలిచిన సీనియర్ ఆర్చర్ డోలా బెనర్జీ (ఆర్ఎస్పీబీ) క్వాలిఫై కాలేకపోయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవళి 21వ, కె. జ్యోతి 26వ స్థానాల్లో నిలిచి నిరాశ పరిచారు. పురుషుల రికర్వ్‌లో జయంత్ తాలుక్దార్ (జార్ఖండ్) 674 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు. తుపువోయి స్వురో (నాగాలాండ్) 664 పాయింట్లు స్కోర్ చేసి రెండో స్థానం సాధించగా...సంజయ్ బోరో (అసోం-661)కు మూడో స్థానం లభించింది. ఈ విభాగంలో ఏపీ ఆర్చర్లు ప్రభావం చూపలేకపోయారు.