ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి | Bishan Sing Bedi Ask DDCA To Remove His Name From Ferozshah Kotla Stand | Sakshi
Sakshi News home page

ఆ స్టేడియంలో నా పేరు తొలగించండి

Dec 24 2020 8:44 AM | Updated on Dec 24 2020 8:47 AM

Bishan Sing Bedi Ask DDCA To Remove His Name From Ferozshah Kotla Stand - Sakshi

న్యూఢిల్లీ : ఫిరోజ్‌షా కోట్లా క్రికెట్‌ స్టేడియంలో ఢిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ) మాజీ అధ్యక్షుడు, దివంగత మాజీ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న డీడీసీఏ నిర్ణయంపై భారత స్పిన్‌ దిగ్గజం ,బిషన్‌ సింగ్‌ బేడీ మండిపడ్డారు. తన నిరసనను తెలుపుతూ డీడీసీఏ ప్రస్తుత అధ్యక్షుడు, అరుణ్‌ జైట్లీ కుమారుడు రోహన్‌ జైట్లీకి ఆయన లేఖ రాశారు. డీడీసీఏలో బంధుప్రీతి విపరీతంగా పెరిగిపోయిందని లేఖలో వ్యాఖ్యానించిన ఆయన క్రికెటర్ల కన్నా ఎక్కువగా పాలకులను ప్రమోట్‌ చేస్తున్నారని విమర్శించారు. వెంటనే కోట్లా స్టేడియంలోని ప్రేక్షకుల స్టాండుకు ఉన్న తన పేరును తొలగించాలని కోరారు. అంతేకాకుండా డీడీసీఏలో తన సభ్యత్వాన్ని వదులుకుంటున్నానని వెల్లడించాడు. భారత క్రికెట్‌కు బేడీ అందించిన సేవలకు గుర్తింపుగా 2017లో ఆయన పేరుతో స్టాండును ఏర్పాటు చేశారు. ఈ లేఖపై స్పందించేందుకు డీడీసీఏ విముఖత వ్యక్తం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement