
సెప్టెంబర్ 16 నుంచి ఆస్ట్రేలియా-ఏ జట్టు భారత్లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఆసీస్ భారత-ఏ జట్టుతో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు, మూడు అనధికారిక వన్డేలు ఆడనుంది. ఈ సిరీస్లకు ముందు ఆసీస్-ఏ టీమ్కు భారీ షాక్ తగిలింది.
ఆల్‌రౌండర్ ఆరోన్ హార్డీ భుజం గాయం కారణంగా తప్పుకున్నాడు. హార్డీ స్థానాన్ని విల్ సదర్లాండ్ భర్తీ చేయనున్నాడు. ఇదివరకే వన్డే జట్టులో సభ్యుడైన సదర్లాండ్ రెండో టెస్ట్ సమయానికి జట్టుతో కలుస్తాడు. వన్డేల్లో హార్డీకి ప్రత్యామ్నాయాన్ని ప్రకటించలేదు.
హార్డీ ఇటీవల వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్‌ల్లో పాల్గొన్నాడు. అయితే, ఆ సిరీస్ల్లో పేలవ ప్రదర్శన కారణంగా త్వరలో జరుగనున్న న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక కాలేదు. హార్డీ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు భారత్-ఏ సిరీస్తో అవకాశం కల్పించగా, గాయం బారిన పడ్డాడు. గాయం తీవ్రం కాకపోతే, వన్డే సిరీస్ ఆడవచ్చు.
భారత్లో ఆస్ట్రేలియా ఏ జట్టు పర్యటన వివరాలు..
సెప్టెంబర్ 16-23: తొలి టెస్ట్ (లక్నో)
సెప్టెంబర్ 23-26: రెండో టెస్ట్ (లక్నో)
సెప్టెంబర్ 30: తొలి వన్డే (కాన్పూర్)
అక్టోబర్ 3: రెండో వన్డే (కాన్పూర్)
అక్టోబర్ 5: మూడో వన్డే (కాన్పూర్)
ఆస్ట్రేలియా-ఏ టెస్ట్ జట్టు..
జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోల్లీ, జాక్ ఎడ్వర్డ్స్, కాంప్‌బెల్ కెల్లావే, సామ్ కాన్స్టాస్, నాథన్ మెక్‌స్వీనీ, టాడ్ మర్ఫీ, ఫెర్గస్ ఓ'నీల్, ఆలివర్ పీక్, జోష్ ఫిలిప్, కోరీ రోచిసియోలి, లియామ్ స్కాట్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్
వన్డే జట్టు..
కూపర్ కొన్నోల్లీ, హ్యారీ డిక్సన్, జాక్ ఎడ్వర్డ్స్, సామ్ ఎలియట్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మెకెంజీ హార్వే, టాడ్ మర్ఫీ, తన్వీర్ సంఘ, లియామ్ స్కాట్, లాచీ షా, టామ్ స్ట్రాకర్, విల్ సదర్లాండ్, హెన్రీ థోర్న్టన్
ఈ సిరీస్‌ల కోసం భారత-ఏ టెస్ట్ జట్టును కూడా ప్రకటించారు. ఈ జట్టుకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) అభిమన్యు ఈశ్వరన్ ఉంటాడు.
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్, అభిమన్యు ఈశ్వరన్ (వైస్ కెప్టెన్), ఎన్ జగదీశన్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బడోని, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యష్ ఠాకూర్