England Vs New Zealand: Ben Foakes Ruled Out Of Series Due To Leg Injury - Sakshi
Sakshi News home page

Ben Foakes:  ఇంగ్లండ్‌కు మరో షాక్‌.. కీలక ఆటగాడు దూరం

May 27 2021 10:16 AM | Updated on May 27 2021 2:22 PM

Ben Foakes Ruled Out Of New Zealand Tests Falling In Dressing Room - Sakshi

న్యూజిలాండ్‌తో పాటు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఫోక్స్‌ దూరం కానున్నాడు.

లండన్‌: ప్రస్తుతం ఇంగ్లండ్‌ అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా గుర్తింపు తెచ్చుకున్న బెన్‌ ఫోక్స్‌ దురదృష్టవశాత్తూ అరుదైన అవకాశాన్ని కోల్పోయాడు. సుదీర్ఘ కాలం వేచి చూసిన తర్వాత స్వదేశంలో తొలి టెస్టు ఆడేందుకు సిద్ధమైన అతను డ్రెస్సింగ్‌ రూమ్‌లో సాక్స్‌లు వేసుకొని నడుస్తూ కాలు జారి పడ్డాడు.  అతని తొడ కండరాల్లో చీలిక రావడంతో కనీసం మూడు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. దాంతో న్యూజిలాండ్‌తో పాటు భారత్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు కూడా ఫోక్స్‌ దూరం కానున్నాడు.

అతని స్థానంలో జేమ్స్‌ బ్రాసీని కీపర్‌గా ఎంచుకున్న ఇంగ్లండ్‌ ప్రత్యామ్నాయ బ్యాట్స్‌మన్‌కు హసీబ్‌ హమీద్‌ను కూడా ఎంపిక చేసింది. మరోవైపు పేస్‌ బౌలర్‌ జోఫ్రా ఆర్చర్‌ కుడి మోచేతికి శస్త్ర చికిత్స జరిగినట్లు ఈసీబీ ప్రకటించింది. కనీసం నాలుగు వారాల తర్వాత అతను కోలుకుంటున్న తీరును చూసి బౌలింగ్‌ను మొదలు పెట్టే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది.   

చదవండి: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. కీలక ఆటగాడు దూరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement