అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు.. వైరలవుతున్న బీసీసీఐ ట్వీట్‌ 

BCCI Tweet Over Anushka Sharma Gone Viral - Sakshi

Internet Has The Best Response To BCCI Tweet Over Anushka Sharma: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి భార్య, ప్రముఖ బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ పేరున బీసీసీఐ చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం తెగ వైరలవుతుంది. ఇందులో అనుష్క శర్మ 88 బంతుల్లో 52 పరుగులు చేసినట్లు బీసీసీఐ పేర్కొంది. దీంతో అనుష్క శర్మ ఏంటీ, క్రికెట్‌ ఆడటమేంటి అని నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే..

భారత మహిళల అండర్‌-19 ఛాలెంజర్స్‌ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు చెందిన అనుష్క శర్మ అనే అమ్మాయి భారత-బి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. మంగళవారం(నవంబర్‌ 2) భారత్‌-ఏ తో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఆల్‌రౌండ్‌ ప్రతిభ చూపి సత్తా చాటింది. మొదట బ్యాటింగ్‌లో 88 బంతుల్లో 52 పరుగులు చేసిన అనుష్క.. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఐదు వికెట్లు తీసింది. దీంతో బీసీసీఐ తమ అధికారిక మహిళల ట్విట్టర్‌ హ్యాండిల్‌లో అనుష్క శర్మను అభినందిస్తూ ఓ పోస్ట్‌ చేసింది. 

ఈ పోస్ట్‌ను చూసిన నెటిజన్లు అనుష్క ఎప్పటి నుంచి క్రికెట్‌ ఆడడం ప్రారంభించిందని గందరగోళానికి గురవుతున్నారు. మరికొందరేమో.. భార్యాభర్తలిద్దరూ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఉంటే వామికను ఎవరు చూసుకుంటున్నారంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌-2021లో టీమిండియా వరుస వైఫల్యాల నేపథ్యంలో కోహ్లి అతని కుటంబంపై కొందరు సోషల్‌మీడియా వేదికగా అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

చదవండి: T20 WC 2021 IND Vs AFG: అరుదైన రికార్డుపై కన్నేసిన టీమిండియా స్టార్‌ పేసర్‌..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top