IND vs SL: శ్రీలంకతో టీ20 సిరీస్‌.. భారత కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా! సూర్యకుమార్‌కు కీలక బాధ్యతలు

BCCI announces Indias T20I and ODI squads for Sri Lanka series - Sakshi

స్వదేశంలో శ్రీలంకతో టీ20, వన్డే సిరీస్‌లకు రెండు వేర్వేరు జట్లను బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. లంకతో టీ20 సిరీస్‌కు భారత రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ దూరమయ్యారు. అదే విధంగా యువ పేసర్లు ముఖేష్‌ కుమార్‌, శివమ్‌ మావికి తొలి సారి భారత టీ20 జట్టులో చోటు దక్కింది. ఇక ఈ జట్టుకు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా సూర్యకుమార్‌ యాదవ్‌ను ఈ సిరీస్‌కు భారత వైస్‌ కెప్టెన్‌గా బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నియమించింది.

జనవరి 3న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక వన్డే జట్టు విషయానికి వస్తే.. భారత వన్డే జట్టు వైస్‌ కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ను బీసీసీఐ తొలిగించింది. అతడి స్థానంలో స్టార్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. ఇక లంకతో టీ20 సిరీస్‌కు దూరంగా ఉన్న రోహిత్‌ శర్మ, రాహుల్‌, విరాట్‌ కోహ్లి వన్డే సిరీస్‌కు తిరిగి జట్టులోకి వచ్చారు. కాగా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌కు టీ20, వన్డే జట్టులో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. అదే విధంగా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కలేదు.

లంకతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), సూర్యకుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్

లంకతో వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), హార్దిక్ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ , ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్
చదవండి: Sarfaraz Ahmed: 'రీఎంట్రీ కదా.. హార్ట్‌బీట్‌ కొలిస్తే మీటర్‌ పగిలేదేమో!'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top