ENG Vs BAN: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన బంగ్లా.. తొలి టి20లో ఘన విజయం

Bangladesh Beat England By Six-Wickets In-First T20 Match - Sakshi

టి20 క్రికెట్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ జట్టుకు బంగ్లాదేశ్‌ గట్టి షాక్‌ ఇచ్చింది. గురువారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 51 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన నజ్ముల్‌ హొసెన్‌ షాంటోకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది.

వన్డే సిరీస్‌ను ఓడిపోయామన్న బాధను మనుసులో పెట్టుకున్న బంగ్లా ఇంగ్లండ్‌ను తొలి టి20లో ఓడించి చావుదెబ్బ కొట్టింది. ఈ విజయంతో బంగ్లాదేశ్‌ మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. కెప్టెన్‌ జాస్‌ బట్లర్‌(42 బంతుల్లో 67, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఫిలిప్‌ సాల్ట్‌(35 బంతుల్లో 38) మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోయారు. బంగ్లా బౌలర్లలో హసన్‌ మహ్ముద్‌ రెండు వికెట్లు తీయగా.. షకీబ్‌, నసూమ్‌, తస్కిన్‌ అహ్మద్‌, ముస్తాఫిజుర్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

అనంతరం బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ 18 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకుంది. నజ్ముల్‌ హొసెన్‌ షాంటో(30 బంతుల్లో 51, 8 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ చేయగా.. తౌహిద్‌ హృదోయ్‌ 24 పరుగులు చేశాడు. చివర్లో కెప్టెన్‌​ షకీబ్‌ అల్‌ హసన్‌ (24 బంతుల్లో 34 నాటౌట్‌), అఫిఫ్‌ హొసెన్‌ (13 బంతుల్లో 15 నాటౌట్‌) జట్టున విజయతీరాలకు చేర్చారు. ఇరుజట్ల మధ్య రెండో టి20 మ్యాచ్‌ ఆదివారం(మార్చి 12న) ఢాకా వేదికగా జరగనుంది.

చదవండి: విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్‌ తయారు చేస్తారా?

పరిచయం లేని యువతికి ముద్దులు.. పరువు తీసుకున్న ఫుట్‌బాలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top